వెల్లుల్లి తొక్కల నుంచి విద్యుత్‌.. షాకిస్తున్న ప్రయోగం | Generate Electricity Garlic Peel Waste | Sakshi
Sakshi News home page

వెల్లుల్లి తొక్కల నుంచి విద్యుత్‌.. షాకిస్తున్న ప్రయోగం

Oct 12 2026 1:51 PM | Updated on Oct 12 2026 1:51 PM

Generate Electricity Garlic Peel Waste

జైపూర్‌: వంటగదిలో పనికిరాని వ్యర్థాలుగా భావించి పారేసే వెల్లుల్లి తొక్కలతో విద్యుత్తును ఉత్పత్తి చేసే సరికొత్త సాంకేతికతను జైపూర్‌లోని మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. బ్యాటరీలు లేదా ప్రమాదకర రసాయనాల అవసరం లేకుండానే, కేవలం బయో-వేస్ట్‌తో విద్యుత్‌ను సృష్టించవచ్చని రుజువు చేస్తూ పర్యావరణహిత ఇంధన దిశగా ఈ ఆవిష్కరణ కీలక ముందడుగు వేసింది.

ఈ విధానంలో 'ట్రైబోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్' సూత్రాన్ని ఉపయోగించారు. పొడి చేసిన వెల్లుల్లి తొక్కలను పాజిటివ్ పొరగా, ప్లాస్టిక్ షీట్‌ను నెగెటివ్ పొరగా ఏర్పాటు చేసి వాటి మధ్య రాపిడి కలిగించినప్పుడు కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఒక పొరతో దాదాపు 210 వోల్టులు, రెండు పొరల వాడకంతో 400 వోల్టుల వరకు వోల్టేజ్ స్పైక్ ఉత్పత్తవుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. ప్రవహించే కరెంట్ పరిమాణం సూక్ష్మంగా ఉన్నప్పటికీ, చిన్న సెన్సార్లను నడపడానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఈ సాంకేతికతతో తలుపులకు అమర్చే సెక్యూరిటీ సెన్సార్‌ను విజయవంతంగా నడిపించి పరీక్షించారు. తలుపు తెరిచినప్పుడు ఏర్పడే రాపిడితో ఎటువంటి బ్యాటరీ లేకుండానే సెన్సార్ పనిచేసింది. పైగా ఆరు నెలల నిల్వ తర్వాత, 200 సార్లు వాడినప్పటికీ ఇది నిలకడగా విద్యుత్తును ఇచ్చింది. టన్నుల కొద్దీ పేరుకుపోయే జీవ వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపుతూనే, భవిష్యత్ స్మార్ట్ హోమ్ పరికరాలకు ఇదొక చక్కని ప్రత్యామ్నాయంగా మారనుంది.

ఇదీ చదవండి: శశి థరూర్ హిందీ వ్యామోహం.. నెటిజన్ల ట్రోలింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement