కాఫీతో తిక్క... దానికో లెక్క! | Research | Sakshi
Sakshi News home page

కాఫీతో తిక్క... దానికో లెక్క!

Sep 8 2015 11:40 PM | Updated on Sep 3 2017 9:00 AM

కాఫీతో తిక్క... దానికో లెక్క!

కాఫీతో తిక్క... దానికో లెక్క!

కాఫీ అతిగా తాగితే మతిభ్రమిస్తుందట! అతిగా తాగేవాళ్లకు రకరకాల భ్రమలు ఏర్పడతాయని, ....

పరిపరి  శోధన

కాఫీ అతిగా తాగితే మతిభ్రమిస్తుందట! అతిగా తాగేవాళ్లకు రకరకాల భ్రమలు ఏర్పడతాయని, ఇలాంటి వాళ్లకు చనిపోయిన సన్నిహితులను తిరిగి చూస్తున్నట్లుగా అనుభూతి కలుగుతుందని బ్రిటిష్ పరిశోధకులు చెబుతున్నారు. మితిమీరి కాఫీతాగే అలవాటు ఉన్న రెండువందల మందిపై విస్తృతంగా అధ్యయనం జరిపి ఈ సంగతిని కనుగొన్నామని బ్రిటన్‌లోని డర్హామ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రోజుకు ఏడు కప్పులకు మించి కాఫీ తాగే వారిలో ఇలాంటి భ్రమలు ఎక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని అంటున్నారు. కెఫీన్ మోతాదు మించితే, శరీరంలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుందని, దీనివల్ల ఇలాంటి భ్రమలు కలుగుతాయని వివరిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement