ఈ చవకబారు షోలు పాడు చేస్తున్నాయి.. | Rekha Bhardwaj Fired on Music Reality Shows | Sakshi
Sakshi News home page

దేవుడిని ప్రార్థిస్తున్నా

Sep 7 2019 7:41 AM | Updated on Sep 7 2019 7:41 AM

Rekha Bhardwaj Fired on Music Reality Shows - Sakshi

గాయని రేఖా భరద్వాజ్‌.. మ్యూజిక్‌ రియాల్టీ షోల నిర్వహణపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘గురుబ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర’ అంటూ ఈ చవకబారు షోలు పాలుగారే వయసును, పసి మనసుల్లోని అమాయత్వాన్ని పాడు చేస్తున్నాయని రేఖ ఆవేదన చెందారు. ఇంత డ్రామా అవసరమా అని ప్రశ్నించారు. ‘‘అది మ్యూజిక్‌ కాదు. ఒట్టి ధ్వని. నన్నెప్పుడూ అలాంటి షోలలో భాగస్వామిని చెయ్యొద్దని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని కూడా ఆమె ట్వీట్‌ చేశారు. 55 ఏళ్ల రేఖా భరద్వాజ్‌ సినీ నేపథ్య గాయని. బాలీవుడ్‌తో పాటు బెంగాలీ, మరాఠీ, పంజాబీ, మలయాళ సినిమాలకు పాడారు. దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ భార్య. ఆయన కన్నా ఏడాదిన్నర పెద్ద.

Advertisement
 
Advertisement
Advertisement