ఉరితాడుతో తాళి బొట్టు

Ready To Hang Nirbhaya Case Convicts Says Pawan Jallad - Sakshi

విషాదం

ఈయన పేరు పవన్‌ జల్లాద్‌. జల్లాద్‌ అంటే ‘తలారి’. హ్యాంగ్‌మ్యాన్‌. తలారి అనగానే మీకు విషయం అర్థమై ఉంటుంది. నలుగురు నిర్భయ దోషుల్ని తీహార్‌ జైల్లో ఉరి తీయబోతున్నది ఈయనే. నలుగుర్ని ఉరి తీసినందుకు పవన్‌కి లక్ష రూపాయలు వస్తుంది. ‘‘ఆ లక్షతో నా కూతురి పెళ్లి చేస్తాను. తను పెద్దదైంది. సంబంధాలు చూస్తున్నాను. డబ్బెలా అనుకుంటున్నప్పుడు నా వృత్తే నాకు ఇలా దారి చూపించింది’’ అంటున్నాడు పవన్‌. తలారుల వంశంలో ఇతడిది నాలుగో తరం. కల్లు జల్లాద్‌ మొదటి తలారి. పవన్‌ అసలు పేరు సింధీరామ్‌. మీరట్‌లో ఓ చిన్న ఇంట్లో ఉంటాడు. భార్య, ఏడుగురు పిల్లలు.

ఆ ఇల్లు కూడా కన్షీరామ్‌ ఆవాస్‌ యోజన కింద ప్రభుత్వం కేటాయించినదే. ఉరి తీసిన డబ్బుతో పిల్ల పెళ్లి చేస్తానని వపన్‌ అనడం ఎంతోమందిని కదిలించింది. ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్‌.. ‘ఇదీ మన దేశం’ అంటూ.. ‘నేను మరణశిక్షను వ్యతిరేకించడానికి మరో కారణం ఉంది. ఉరి తీయడం కోసం ఢిల్లీ దాకా ఎందుకు వచ్చారని నేను తలారిని ప్రశ్నించినప్పుడు, తన కుమార్తె వివాహం కోసం డబ్బు అవసరం అని ఆయన చెప్పడం ఎంత విషాదకరం’ అంటూ ట్వీట్‌ చేశారు. ‘‘స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్‌’ అని పాడతాడు ‘ఆకలిరాజ్యం’ సినిమాలో కమల్‌హాసన్‌. ఆ పాట గుర్తుకొస్తోంది పవన్‌ దయనీయ స్థితి గురించి వింటే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top