కుందేటి జ్వరం..! | Rabbit Fever! | Sakshi
Sakshi News home page

కుందేటి జ్వరం..!

Feb 15 2016 10:34 PM | Updated on Sep 3 2017 5:42 PM

కుందేటి జ్వరం..!

కుందేటి జ్వరం..!

ఈ జబ్బు పేరు కుందేలు జ్వరం. పేరుకు కుందేలు జ్వరం అయినా నిజానికి ఇది ఫ్రాన్సిస్ టులరెన్సిస్ అనే ఒక రకం బ్యాక్టీరియా వల్ల వస్తుంటుంది.

మెడిక్షనరీ
ఈ జబ్బు పేరు కుందేలు జ్వరం. పేరుకు కుందేలు జ్వరం అయినా నిజానికి ఇది  ఫ్రాన్సిస్ టులరెన్సిస్ అనే ఒక రకం బ్యాక్టీరియా వల్ల వస్తుంటుంది. ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చే  జబ్బు కాబట్టి దీన్ని వైద్యపరిభాషలో ‘టులెరేమియా’ అని కూడా అంటారు. కుందేళ్లు, ఆ జాతికి చెందిన ఇతర ప్రాణుల వల్ల వాటి నుంచి మనుషులకూ ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది వచ్చిన వారిలో జ్వరం, అలసట, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

పెంపుడు కుందేళ్లకు తగిన వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల ఈ వ్యాధిని రాకుండా నివారించవచ్చు. వాటిని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటే గ్లౌవ్స్ వంటివి తొడుక్కోవడం మేలు. ఇక కుందేలు జ్వరం వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్ట్రెప్టొమైసిన్ లేదా టెట్రాసైక్లిన్ తరగతికి చెందిన యాంటీబయాటిక్స్‌తో దీనికి చికిత్స చేయవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement