అస్సాం రాబిట్
కిడ్స్ స్పెషల్
ప్రాణి ప్రపంచం
మీకు కుందేలు అంటే ఇష్టమా? తెలివైన కుందేలు, నెమ్మదైన తాబేలు కథ గుర్తుందా? మరి నిజమైన కుందేలు గురించి మీకు తెలుసా? మన దేశంలో మనం ‘కుందేలు’ అని పిలిచేది నిజానికి ‘కుందేలు’ కాదు. అది ముయ్యి కుందేలు, అంటే హేర్. తేడా ఏమిటి? నిజమైన కుందేలు గుంటలు తవ్వి గుంపుగా ఉంటుంది. పిల్లలు కళ్లు మూతేసి, బొచ్చు లేకుండా పుడతాయి. హేర్ గుంటలు తవ్వదు. ఒంటరిగా గడ్డిలో ఉంటుంది. పిల్లలు బొచ్చుతో, కళ్లు తెరిచి, పుట్టిన వెంటనే పరిగెత్తేలా పుడతాయి.
మన ఇండియన్ హేర్ దేశమంతా ఉంది. రాజస్థాన్ ఎడారి నుంచి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ΄పొలాల వరకు కనిపిస్తుంది. దీనికి వెంటనే అంతరించే ప్రమాదం లేదు. కానీ వేట, అడవులు తగ్గి ΄పొలాలు పెరగడం వల్ల వీధి కుక్కలు, డేగలు, ఇతర మాంసాహారులు దీనిని చంపుతున్నాయి.
ఆస్ట్రేలియా రాబిట్, యూరోపియన్ రాబిట్, ఇండియన్ హేర్
మరో రకం ఉంది, హిస్పిడ్ హేర్. ఇది పేరుకే హేర్ కానీ, నిజానికి ఇది కుందేలు జాతికి చెందినది. ఇది అరుదైనది, అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. అస్సాం, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ రాష్ట్రాల్లో ఎత్తైన గడ్డి మైదానాల్లోనే ఉంటుంది. గడ్డి కోయడం, మంటలు, వ్యవసాయ విస్తరణ వల్ల దీని ఇల్లు పోతోంది.ఇక నిజమైన కుందేలు ఎక్కడుంది? అది పుట్టింది స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో. కానీ ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అక్కడ 10 కోట్లకు పైగా ఉన్నాయి.
ఇక మనం ఇళ్లల్లో పెంచుకునే తెల్లటి బొచ్చు కుందేలు ఉందే. అది యూరోపియన్ కుందేలు. అది మరీ సెన్సిటివ్. చిన్న శబ్దానికి, వేడికి, ఒంటరితనానికి కూడా స్ట్రెస్‌కు గురవుతుంది. చెవులు పట్టి ఎత్తకూడదు, వెన్నెముక చాలా పెళుసు. పచ్చి గడ్డి, ఎండుగడ్డి ఆహారంగా ఇవ్వాలి.పిల్లలూ, కథల్లో కుందేలు తెలివైనది. నిజీవితంలో దాన్ని కాపాడే తెలివి మనకు ఉండాలి. గడ్డి మైదానాలు కాపాడితేనే కుందేలు బతుకుతుంది.
ఇదీ చదవండి: సముద్రానికి ఇన్ని పేర్లు ఎందుకో తెలుసా?


