దేవునిపై విశ్వాసం నిశ్చింతగా ఉంచుతుంది

దేవునిపై విశ్వాసం నిశ్చింతగా ఉంచుతుంది


సువార్త

 

నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.

- యిర్మియా 29:11


 

జీవితంలో ప్రతిదీ మనం అనుకున్నట్లు, మనం ఆశించినట్లు జరగకపోవచ్చు. అంతమాత్రాన మనం నిరుత్సాహం చెందకూడదు.  మనకు ఎదురైన దానినే మనం స్వీకరించాలి.  దేవుడు మన మంచి కోసం దానిని ఏర్పరిచాడని విశ్వసించాలి. దేవుడు మనకు హాని తలపెట్టడు. తన పిల్లల కోసం ఆయన ఏది సంకల్పించినా, ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేసి ఉంచినా అది హితవు కోసమే అయి ఉంటుంది. మనకు ఏది మంచో, మనకు ఏది అవసరమో దేవునికి తెలిసినంతగా మనకు గానీ, మరెవ్వరికి గానీ తెలియదు. దేవుని ద్వారా మనకు సంభవించే దాని గురించి సందేహాలు అవసరం లేదు. జీవితంలో మనకు జరిగిన, జరగబోతున్న మంచి అంతా ఆయన నుంచే వెలుగులా మనపై ప్రసరిస్తుంది. దేవుడు మనల్ని కోరేది ఒక్కటే. తనను విశ్వసించమని. తనను నమ్మి నిశ్చింతగా ఉండమని.

 

- జాయ్స్ మేయర్

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top