గర్భిణులు కాయధాన్యాలను ఎందుకు తినాలి?

Protein Food For Pregnant Women - Sakshi

గర్భిణికి తగిన మోతాదులో విటమిన్లు, ఖనిజాలు, మాంసకృత్తులు, పీచు పదార్థాలు అందుతుండాలి అని వైద్యులు చెబుతుంటారు. ప్రసవించాక కూడా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పోషకాలు తప్పనిసరి. దీనర్థం గర్భంతో ఉన్నవారు పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవాలని కాదు. కొద్ది మొత్తంలో తీసుకుంటూనే పెద్దమొత్తంలో పై పోషకాలు ఉండేలా శ్రద్ధ తీసుకుంటే చాలు. గుడ్లు, ఆకుకూరలు, చేపలతో పాటు.. కాయధాన్యాలలో గర్భిణికి అవసరమైన పోషకాలన్నీ ఉంటాయి. కాయధాన్యాలంటే.. కాయల్లో ఉండే ధాన్యా లు. కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఇంకా బీన్స్‌ వంటి వాటితో వండిన కాయధాన్య ఆహారం గర్భిణికి సత్తువనిస్తుంది. శక్తిని ఇవ్వడమే కాదు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా నివారిస్తుంది. అవి ఏమిటో ఒక్క మాటలో తెలుసుకుందాం.

కాయధాన్యాలుగర్భిణులలో రక్తహీనతను నివారిస్తాయి.గర్భస్థ శిశు లోపాలను తగ్గిస్తాయి.అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి.మైగ్రేన్‌ తలనొప్పుల తీవ్రత ఉండదు.మలబద్ధక సమస్య తలెత్తదు.రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు సరిగా ఉంటాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top