మండే ఎండలకు ప్లాస్టిక్‌ పూత విరుగుడు

Plastic coating antidote for glowing sunshine - Sakshi

ఎండాకాలంలోనూ భవనాలు చల్లగా ఉండేలా చేసేందుకు కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్న పరిష్కారాన్ని కనుక్కున్నారు. సూక్ష్మస్థాయి గాలిబుడగలు ఉన్న ప్లాస్టిక్‌ పూతను వాడటం ద్వారా భవనాల ఉష్ణోగ్రతలను మూడు నుంచి ఆరు డిగ్రీ సెల్సియస్‌ వరకూ తగ్గించవచ్చునని వీరు అంటున్నారు. పెరిగిపోతున్న వేడిని తగ్గించుకునేందుకు పైకప్పులను తెల్లటి పెయింట్‌ వేసుకోవడం ఓ పద్ధతి అని మీరు వినే ఉంటారు. అయితే ఈ పద్ధతిలో ఓ చిక్కు ఉంది. సూర్యకిరణాల్లోని పరారుణ కాంతి కిరణాలను ఈ పెయింట్‌ అడ్డుకోలేదు. మిగిలిన కాంతిలోనూ సగం మాత్రమే మళ్లీ అంతరిక్షంలోకి తిప్పి పంపగలదు. గాలిబుడగలు ఉన్న పెయింట్‌తో ఈ చిక్కులేవీ ఉండవు.

దాదాపు 96 శాతం సూర్యకాంతిని తిప్పి పంపడంతోపాటు అంతేస్థాయిలో వేడిని కూడా నిరోధించగలదు ఇది అని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త యాన్‌ యాంగ్‌ తెలిపారు. నీటితోపాటు సాల్వెంట్, ప్లాస్టిక్‌ను ఉపయోగించడం ద్వారా కొత్త రకం పెయింట్‌ను తయారు చేయవచ్చునని వివరించారు. బంగ్లాదేశ్‌తోపాటు అమెరికాలోని అరిజోనా ఎడారి ప్రాంతంలో తాము ఈ పెయింట్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించామని, అరిజోనాలో ఆరు డిగ్రీ సెల్సియస్‌ వేడి తగ్గితే.. గాల్లో తేమశాతం ఎక్కువగా ఉండే బంగ్లాదేశ్‌లో ఇది మూడు డిగ్రీ సెల్సియస్‌గా ఉందని వివరించారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top