మరీ అవసరమైతే తప్ప నొప్పి నివారణ మందులు వద్దు!

People With Heart Attacks Should Not Take Painkillers - Sakshi

నొప్పి నివారణ మందులైన పెయిన్‌ కిల్లర్స్, ఎన్‌ఎస్‌ఏఐడీస్‌ (నాన్‌ స్టెరాయిడ్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌) వాడటం సరికాదని మందులకు అధికారికంగా అనుమతి ఇచ్చే అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) 2005లోనే హెచ్చరికలు చేసింది. ఆ హెచ్చరికల్లో వాస్తవం ఉందని ఇటీవలి అధ్యయనాల్లో మళ్లీ మరోసారి నిరూపితమైంది. నొప్పి నివారణ మందులు వాడాల్సి వస్తే వాటిని ఒకటి, రెండు వారాలకు మించి వాడవద్దని ఎఫ్‌డీఏ మరోమారు హెచ్చరిస్తోంది. ఎన్‌ఎస్‌ఏఐడీ వంటి నొప్పినివారణ మందులను దీర్ఘకాలం వాడటం వల్ల అది గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

అయితే ఆస్పిరిన్‌ కూడా ఎన్‌ఎన్‌ఏఐడీ ల విభాగానికే చెందినదే అయినా దీనికి మాత్రం మినహాయింపునిచ్చారు. దీన్ని దీర్ఘకాలం వాడినా పర్వాలేదన్నమాట. ఇక ప్రత్యేకంగా ఇప్పటికే గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్‌ డిసీజెస్‌) ఉన్నవారు, బైపాస్‌ అయినవారు, ఒకసారి గుండెపోటు వచ్చినవారు నొప్పినివారణ మందులు తీసుకోవాల్సి వస్తే... ఆన్‌కౌంటర్‌ మెడిసిన్‌లా కాకుండా, తప్పక డాక్టర్‌ను సంప్రదించాకే వాటిని వాడాలని ఎఫ్‌డీఏకు చెందిన నిపుణులు సూచిస్తున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top