breaking news
Chemist
-
దీపావళి కానుకేమో! బ్యాంక్ అకౌంట్లోకి రూ.4 కోట్లు
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్కు చెందిన ఓ వ్యక్తి దీపావళి నాడు కోటీశ్వరుడు అయ్యాడు. అతనికి చెందిన రెండు వేర్వేరు బ్యాంక్ అకౌంట్లలోకి రూ.4 కోట్లకు పైగా వచ్చి డబ్బు వచ్చిపడింది. ఈ డబ్బు గుర్తుతెలియని ఖాతాల నుంచి జమవడంతో ఖంగారుపడ్డ ఆ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అలీఘడ్‌లో మెడికల్ స్టోర్ నిర్వహించే మహమ్మద్ అస్లాం.. తన బ్యాంక్ ఖాతాలలో పెద్ద మొత్తం జమవడంపై బ్యాంక్ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ దీపావళి సెలవు కావడంతో బ్యాంక్ అధికారుల నుంచి స్పందన రాలేదు. దీంతో అతడు డయల్ 112 కి ఫోన్ చేసి పోలీసులకు విషయం తెలియజేశాడు. తనకు చెందిన ఐడీఎఫ్సీ, యూకో బ్యాంకు ఖాతాల్లోకి నవంబర్ 11, 12 తేదీల్లో పలు దఫాలుగా రూ.4.78 కోట్లు జమైనట్లు అస్లాం తెలిపాడు. అవాక్కైన తాను వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించానని, కానీ వారు సమస్యను పరిష్కరించలేదని పేర్కొన్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక డయల్ 112కి ఫోన్ చేసి విషయం చెప్పానని, తర్వాత వారి సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశానని అస్లాం వివరించాడు. దీనిపై నగర పోలీసు అధికారి మృగాంక్ శేఖర్ పాఠక్ మాట్లాడుతూ దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. బ్యాంకులు పూర్తిగా తెరుచుకున్న తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. -
మహారాష్ట్రలో కెమిస్ట్ దారుణ హత్య
నాగపూర్: మహారాష్ట్రలోని అమరావతి నగరంలో దారుణం జరిగింది. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టును షేర్ చేశాడన్న కారణంతో 54 ఏళ్ల కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు కొల్హేను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. జూన్ 21న ఈ సంఘటన జరిగిందని, ఇప్పటిదాకా ఆరుగురిని అరెస్టు చేశామని అమరావతి పోలీసు కమిషనర్ డాక్టర్ ఆర్తీసింగ్ శనివారం తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ (32)ను నాగపూర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యలాల్ హత్య కంటే వారం ముందే ఉమేశ్ హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది. నుపుర్ శర్మకు మద్దతుగా నిలిచినందుకు కన్హయ్యలాల్‌ను ఇద్దరు వ్యక్తులు పొడిచి చంపేసిన సంగతి తెలిసిందే. ఉమేశ్ అమరావతి సిటీలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ గ్రూప్‌ల్లో ఒక పోస్టును షేర్ చేశాడని పోలీసులు చెప్పారు. సదరు గ్రూపుల్లో అతడి కస్టమర్లతోపాటు కొందరు ముస్లింలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఉమేశ్‌పై కక్ష పెంచుకున్న ఇర్ఫాన్ ఖాన్ అతడిని హత్య చేయాలని పథకం రచించాడని, ఇందుకోసం ఐదుగురిని రంగంలోకి దింపాడని తెలిపారు. హత్య చేస్తే రూ.10,000 ఇస్తానని, పోలీసులకు దొరక్కుండా పారిపోవడానికి కారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడని వివరించారు. జూన్ 21న రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్య దుకాణం మూసివేసి, ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ఉమేశ్‌ను మెడపై పదునైన కత్తితో నరికి, హత్య చేశారని వెల్లడించారు. నిందితులంతా కూలీలు.. ఉమేశ్ కుమారుడి ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్ ఖాన్, ముదాసిర్ అహ్మద్(22), షారుఖ్ పఠాన్(25), అబ్దుల్ తౌఫిక్(24), షోయబ్ ఖాన్(22), అతీబ్ రషీద్(22)పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. వీరంతా అమరావతి వాసులేనని, రోజు కూలీలుగా పనిచేస్తున్నారని చెప్పారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్య దృశ్యాలు నమోదైన సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)ను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అమరావతికి ఎన్ఐఏ బృందం అమరావతిలో కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు హత్యపై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి శనివారం ట్విట్టర్లో వెల్లడించారు. ఉమేశ్ హత్య కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో నిజానిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఎన్ఐఏ బృందం శనివారం అమరావతికి చేరుకుంది. ఆదివారం నుంచి దర్యాప్త చేపట్టనుంది. మహారాష్ట్ర పోలీసు శాఖకు చెందిన యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) టీమ్ కూడా ఔరంగబాద్ నుంచి అమరావతికి వచ్చింది. ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్యలాల్ హత్యపై ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన విషయం విదితమే. కన్హయ్య కుటుంబానికి రూ.కోటి విరాళంగా సమకూర్చి అందజేస్తామని బీజేపీ ప్రకటించింది. -
మరీ అవసరమైతే తప్ప నొప్పి నివారణ మందులు వద్దు!
నొప్పి నివారణ మందులైన పెయిన్ కిల్లర్స్, ఎన్ఎస్ఏఐడీస్ (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) వాడటం సరికాదని మందులకు అధికారికంగా అనుమతి ఇచ్చే అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) 2005లోనే హెచ్చరికలు చేసింది. ఆ హెచ్చరికల్లో వాస్తవం ఉందని ఇటీవలి అధ్యయనాల్లో మళ్లీ మరోసారి నిరూపితమైంది. నొప్పి నివారణ మందులు వాడాల్సి వస్తే వాటిని ఒకటి, రెండు వారాలకు మించి వాడవద్దని ఎఫ్‌డీఏ మరోమారు హెచ్చరిస్తోంది. ఎన్ఎస్ఏఐడీ వంటి నొప్పినివారణ మందులను దీర్ఘకాలం వాడటం వల్ల అది గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ఆస్పిరిన్ కూడా ఎన్‌ఎన్‌ఏఐడీ ల విభాగానికే చెందినదే అయినా దీనికి మాత్రం మినహాయింపునిచ్చారు. దీన్ని దీర్ఘకాలం వాడినా పర్వాలేదన్నమాట. ఇక ప్రత్యేకంగా ఇప్పటికే గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్) ఉన్నవారు, బైపాస్ అయినవారు, ఒకసారి గుండెపోటు వచ్చినవారు నొప్పినివారణ మందులు తీసుకోవాల్సి వస్తే... ఆన్‌కౌంటర్ మెడిసిన్‌లా కాకుండా, తప్పక డాక్టర్‌ను సంప్రదించాకే వాటిని వాడాలని ఎఫ్‌డీఏకు చెందిన నిపుణులు సూచిస్తున్నారు. -
రేపు ‘కెమిస్ట్ డ్రగ్గిస్ట్’ వార్షికోత్సవం
విజయవాడ (గాంధీనగర్) : ఈ నెల 25న ది కృష్ణా జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ 72వ వార్షికోత్సవం బెంజ్ సర్కిల్లోని ది కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో జరుగుతుందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిఎస్ పట్నాయక్ శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో తెలిపారు. వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథులుగా మంత్రి కామినేని శ్రీనివాస్, అసోసియేషన్ జాతీయ అ««దl్యక్షుడు జె ఎస్ షిండే హాజరవుతారన్నారు. కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందజేస్తామని, సభ్యులందరూ పాల్గొనాలని కోరారు. అ««దl్యక్షుడు రామారావు, కోశాధికారి ఎమ్మెస్పీ సుధాకర్ పాల్గొన్నారు. -
వయసును నిలిపేయండి... వ్యాధుల్ని జయించండి!
మీరు తక్కువ వయసు వారిగా కనిపిస్తూ దీర్ఘకాలం యౌవనంతో ఉండాలనుకుంటున్నారా? మీ వయసు పదేళ్లు వెనక్కుపోతే బాగుంటుందనిపిస్తోందా? మీకు ఏ జబ్బులూ త్వరగా రాని విధంగా వ్యాధినిరోధకశక్తి ఉండాలని భావిస్తున్నారా? వీటన్నింటికీ పరిష్కారం యాంటీ ఆక్సిడెంట్స్. ఇంతటి శక్తిమంతమైన ఈ పోషకాల కోసం మనం ఏ ట్యాబ్లెట్లూ మింగనక్కర్లేదు, ఏ టానిక్కులూ తాగనక్కరలేదు. అన్ని సీజన్లలో లభించే తాజా పండ్లు, ఆకుపచ్చటి కూరగాయలు తింటే చాలు... మీరు కోరుకునే పై కోరికలన్నీ తీరతాయి. అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్పై అవగాహన కోసం ఈ కథనం. యాంటీ ఆక్సిడెంట్స్ మిమ్మల్ని చాలాకాలం పాటు వయసు పైబడకుండా చేయడమే కాదు... ఆ వయసులో ఉండే వ్యాధినిరోధకతనూ సమకూరుస్తాయి. ఆ పని ఎలా చేస్తాయో తెలుసుకునే ముందుగా మనం మనలోని జీవకణాల గురించి కాస్త తెలుసుకోవాలి. మన దేహమంతా జీవకణాలతో నిర్మితమై ఉంటుంది. ప్రతి జీవకణంలోనూ ప్రతిక్షణం జీవక్రియలు జరుగుతూనే ఉంటాయి. మన దేహాన్ని ఒక వాహనంతో పోల్చుదాం. ఇంధనం మండి, శక్తి విడుదల అయితేనే కదా బండి నడిచేది. అలాగే మన జీవక్రియలన్నీ నడవాలంటే కూడా ప్రతి జీవకణంలో ఇంధనం మండి, శక్తి వెలువడాలి. కణాల్లోని జీవక్రియల్లో జరిగిదేదిదే. ఈ జీవక్రియల్లో మనం తీసుకున్న పదార్థాలు పరమాణువుల రూపంలో ఉండే అయాన్లుగా మారతాయి. ఒక పదార్థం మూలకంగా ఉన్నప్పుడు మాత్రమే అస్థిత్వాన్ని కలిగి ఉంటుంది. కానీ అది దాని పరమాణువులుగా మారి అయాన్ల రూపంలో ఉన్నప్పుడు అస్థిత్వం కలిగి ఉండక... తన అస్థిత్వం కోసం పక్కనున్న పదార్థాలతో రసాయనిక చర్య జరిపి మళ్లీ స్థిరమైన మూలకంగా ఏర్పడటం కోసం తపిస్తుంటుంది. ఈ క్రమంలో పక్కన ఏ పదార్థం ఉంటే దానితో రసాయనికచర్య జరుపుతుంది. ఇలా రసాయనిక చర్య జరపడం అంటే మామూలు పరిభాషలో దాన్ని తినేయడమే. ఉదాహరణకు బయటపడి ఉన్న ఒక ఇనుపముక్కతో గాలిలో ఉండే ఆక్సిజన్ రసాయనికచర్య జరిపిందనుకుందాం. ఒక కెమిస్ట్ పరిభాషలో చెప్పాలంటే అక్కడ ఆక్సీకరణం జరిగిందంటారు. కానీ మామూలు వ్యక్తుల భాషలో చెబితే ఆ ఇనుపముక్కకు తుప్పు పట్టిందంటారు. ఇలాగే మన దేహంలోని కణాల్లోనూ శక్తిని ఉత్పన్నం చేయడం కోసం మనం పీల్చుకునే ఆక్సిజన్ కణాల్లో పోషకాలను మండిస్తుంది. ఆ ప్రక్రియలో జరిగే ఆక్సిడేషన్ ప్రక్రియలో అయాన్లు వెలువడతాయి. ఆ అయాన్లపై విద్యుదావేశం ఉంటుంది కాబట్టి వాటిని ఫ్రీ రాడికల్స్ అంటారు. ఆ అయాన్లపై ఉండే విద్యుదావేశాలు రెండూ... పాజిటివ్, నెగెటివ్ చర్య జరిపి ఒక న్యూట్రల్ పదార్థాన్ని ఏర్పరిస్తేనే గాని మళ్లీ ఆ అయాన్ల ప్రభావం అంతరించదు. ఈ ప్రక్రియలో ఆక్సిడేషన్ తర్వాత అయాన్లు వెలువడతాయి కాబట్టి వాటిని ఆక్సిడెంట్స్ అనుకోవచ్చు. ఇక మనం తీసుకునే తాజా పండ్లు, ఆకుకూరల్లోని పోషకాలు ఆ అయాన్లతో వెంటనే చర్య జరిపి, మన దేహంలోని మిగతా కణాలు వెంటనే దెబ్బతినకుండా కాపాడతాయి. అంటే ఆక్సిడెంట్స్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి కాబట్టి వాటిని ‘యాంటీ-ఆక్సిడెంట్స్’ అంటారన్నమాట. కణకాలుష్యం నుంచి విముక్తి, దీర్ఘకాలపు యౌవనప్రాప్తి ఎలా? వాహనంలో ఇంధనం మండినప్పుడు శక్తి వెలువడి వాహనాన్ని నడిపిస్తుంది. ఈ క్రమంలో విడుదలైన కాలుష్యపు పొగ... వాహనానికి ఉన్న గొట్టం ద్వారా బయటకు వస్తుంది. మరి మన దేహంలోని కణాల్లోనూ ఇదే ప్రక్రియ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. అప్పుడు కూడా మన దేహకణాల్లో మనం పీల్చుకున్న ఆక్సిజన్ వల్ల (అంటే రెస్పిరేషన్ కారణంగా), ఒక పక్క కణనిర్మాణమూ, మరో పక్క కాలుష్యంతో కణ నాశనం... ఇలా జరిగే కణనాశన ప్రక్రియను అరికట్టేందుకు కణం రిపేర్... ఇవన్నీ జరిగే జీవక్రియల్లో (అంటే మెటబాలిక్ కార్యకలాపాల్లో), శక్తివనరు అయిన గ్లూకోజ్ మండి శక్తి వెలువడే ప్రక్రియలో (అంటే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో) కణాల్లోనూ కాలుష్యాలు ఏర్పడతాయి. ఇవి శరీరంలో లోపల ఏర్పడే కాలుష్యాలు. కాగా మన వాతావరణంలోనూ దేహకణాలకు హానిచేసే కాలుష్యాలు ఉంటాయి. అవి... వాతావరణ కాలుష్యం, సూర్యకాంతి, ఎక్స్-రేలు, పొగ, ఆల్కహాల్ వంటివి. ఇవన్నీ మనలో అంతర్గతంగా ఏర్పడే కాలుష్యాలు, బయటి కాలుష్యాలు కలగలసి మన దేహ కణాలను నిత్యం దెబ్బతీస్తూ ఉంటాయి. ఒకవేళ ఇలా దెబ్బతీయడమే ఎక్కువగా జరుగుతుంటే మన కణాలకు త్వరగా వృద్ధాప్యం వస్తుంది. ఒకవేళ అప్పటికప్పుడు ఆ కాలుష్యాలను తొలగిస్తూ, అవి చూపే ప్రభావాలను తగ్గిస్తూ ఉండే పోషకాలను మనలోకి పంపిస్తున్నామనుకోండి. అప్పుడు కణం దీర్ఘకాలం ఆరోగ్యంగా, యౌవనంగా ఉంటుంది కదా. అలా ఉండటం వల్ల ఒకపట్టాన మనకు వృద్ధాప్యం దరిచేరదన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్‌తో ఏయే వ్యాధుల నుంచి రక్ష... యాంటీ ఆక్సిడెంట్స్ అనేక వ్యాధుల నుంచి మన దేహాన్ని రక్షిస్తాయి. ప్రధానంగా రెండు రకాలుగా ఇవి శరీరంలోని కణాలను కాపాడతాయి. ఒకటి పోషకాల రూపంలో తీసుకున్నప్పుడు అంటే విటమిన్లు, ఖనిజాలు (మినరల్స్) గా స్వీకరించినప్పుడు. దాంతోపాటు ప్రోటీన్ల రూపంలోని కొన్ని పోషకాలు మన దేహంలోకి వెళ్లాక రసాయనికచర్యల తర్వాత ఎంజైములుగా మారి కూడా కణాల పాలిట శ్రీరామరక్షగా ఉంటాయి. ఇలా ఈ రెండు తరహాల్లో అవి మనల్ని ఏ క్యాన్సర్ ఏ గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్ ఏ పక్షవాతం (స్ట్రోక్) ఏ అల్జైమర్స్ ఏ వ్యాధినిరోధకశక్తిలోపంతో వచ్చే జబ్బులు ఏ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏ క్యాటరాక్ట్... వంటి ఎన్నో వ్యాధుల నుంచి కాపాడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పనితీరుకు ఇదో ఉదాహరణ... యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోడానికి ఒక చిన్న ఉదాహరణ. మీరు ఒక ఆపిల్‌ను కోసి వాతావరణంలో ఉంచారనుకోండి. ఆపిల్‌లోని ఇనుముతో గాలిలోని ఆక్సిజన్ చర్య జరిపి కాసేపటి తర్వాత అది బ్రౌన్ రంగులోకి మారుతుంది. కానీ ఒక నిమ్మకాయను పిండి ఆ రసాన్ని ఆపిల్ ముక్కలపై పడేలా చేస్తే అది అలా మారదన్నమాట. అంటే నిమ్మరసంలోని విటమిన్ ‘సి’ అనే యాంటీ ఆక్సిడెంట్... ఆపిల్‌లోని ఇనుము కణాల (ఫ్రీరాడికల్స్)తో), గాలిలోని ఆక్సిజన్ కణాల (ఫ్రీ-రాడికల్స్) తో చర్యజరపకుండా కాపాడిందన్నమాట. ఈ క్రమంలో ఆక్సిజన్ కణాలతో నిమ్మలోని యాంటీఆక్సిడెంట్స్ చర్య జరిపి ఆపిల్ ను రక్షించాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఆపిల్ ముక్కలను తాజాగా ఉంచినట్లు, మన దేహంలోని కణాలనూ తాజాగా ఉంచుతాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్‌లో రకాలు : ఏ ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్స్ : గ్లూటాథయోన్, ఎస్ఓడీ వంటివి శరీరంలోనే ఉత్పత్తి అయి, అవి 24 గంటలూ శరీరంలోనే ఉంటూ కణాలను రక్షిస్తూ ఉంటాయి. వీటిని ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఏ సెకండరీ యాంటీ ఆక్సిడెంట్స్ : వీటిని మనం బయటి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి, మన దేహ కణాలను రక్షిస్తుంటాయి. స్వాభావికంగా దొరికే యాంటీ ఆక్సిడెంట్లు... ఏ చిక్కుళ్లు : చిక్కుళ్ల పైతోలులో ఉండే పాలీఫినాల్స్ అనే పోషకాలు చాలా విలువైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇక రాజ్మా, కిడ్నీ బీన్స్ కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్లే. ఏ టొమాటో : వీటిల్లో లైకోపిన్ అనే పోషకం ఉంటుంది. ఇది యాంటీ-క్యాన్సరస్‌గా పనిచేసే యాంటీఆక్సిడెంట్. అయితే టొమాటోలు తినడం ద్వారా లభ్యమయ్యే లైకోపిన్ మన శరీరంలో ఇంకడానికి ఆరోగ్యకరమైన కొవ్వులు కావాలి. అందుకే వాటిని నాణ్యమైన నూనెతో చేసిన వంటకంగా తీసుకుంటే ఎంతో ఆరోగ్యం. ఏ నట్స్ : బాదం, ఆక్రోట్, వేరుశనగ గింజలు వంటి వాటిల్లో విటమిన్ ‘ఇ’ పుష్కలంగా ఉంటుంది. ఇది కణాలను దెబ్బ తినకుండా రక్షించి, వయసు పైబడనివ్వకుండా చేస్తుంది. అంతేకాదు.. క్యాన్సర్, గుండెజబ్బులు, క్యాటరాక్ట్ వంటి జబ్బుల నుంచి కాపాడుతుంది. విటమిన్ ‘ఇ’ మరో విటమిన్ అయిన ‘సి’తో కలిసి కొన్ని దీర్ఘకాలిక జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఏ బెర్రీ పండ్లు : బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో యాంథోసయనిన్, హైడ్రాక్సిసిన్నమిక్ ఆసిడ్, హైడ్రాక్సీబెంజోయిక్ ఆసిడ్, ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలు, విటమిన్‘సి’ పుష్కలంగా ఉంటాయి. ఇది అన్ని యాంటీ ఆక్సిడెంట్స్లలోకెల్లా ప్రభావవంతమైనది. పై పోషకాలన్నీ కలిసి మన శరీరానికి ఎన్నో విధాల రక్షణను, ఆరోగ్యాన్నీ సమకూరుస్తాయి. ఎన్నో ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని కాపాడతాయి. మన దేహంలోని కండరాలు, ఎముకలతో బలంగా పట్టి ఉంచేందుకు దోహదపడే కొలాజెన్ ఉత్పాదనకు తోడ్పడతాయి. మన రక్తనాళాలన్నీ చివరల వరకూ మూసుకుపోకుండా సంరక్షిస్తూ... ఏదైనా గాయం అయినప్పుడు వెంటనే మానేందుకు ఉపకరిస్తాయి. అంతేకాదు... పై పోషకాలు ఇనుము, ఫోలేట్ అనే పోషకాలు మన దేహంలోకి వేగంగా ఇమిడిపోయేలా చేస్తాయి. ఏ ద్రాక్షపండ్లు : ఈ పండ్లలో ‘రిస్వెరట్రాల్’ అనే పోషకం ఉంటుంది. ఇది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి సమర్థంగా ఉపయోగపడుతుంది. మనం చాలా ప్రభావవంతమైన విటమిన్ ‘సి’తో పోల్చినా ద్రాక్షలో ఉండే రిస్వెరట్రాల్ పోషకం హాని చేసే కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) పట్ల దాదాపు 10 నుంచి 20 రెట్లు అధిక ప్రభావపూర్వకంగా పని చేసి చాలా వేగంగా దాన్ని నిర్వీర్యం చేస్తుంది. అందుకే ద్రాక్షపండ్లు గుండెజబ్బులు రాకుండా రక్షణ కల్పిస్తుంది. నిర్వహణ: యాసీన్ యాంటీ ఆక్సిడెంట్ తాలూకు శక్తి, ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని, ఏయే యాంటీ ఆక్సిడెంట్స్ లోపాల వల్ల ఏయే పరిణామాలు సంభవిస్తాయో శాస్త్రీయంగా గుర్తించి, ఆ లోపాలను భర్తీ చేసేలా, అవసరమైన యాంటీ ఆక్సిడెంట్‌ను ఇచ్చి రుగ్మతలను సరిచేసే ప్రయత్నాన్ని రేవా హెల్త్, స్కిన్, హెయిర్ సంస్థ చేస్తోంది. ఇందుకోసం యాంటీ ఆక్సిడెంట్ ప్రోగ్రామ్ (ఏటీపీ) పేరిట ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో ఫిజీషియన్, న్యూట్రిషనిస్ట్, చర్మవ్యాధి నిపుణులు పాలుపంచుకుంటారు. మేని ఛాయ ప్రకాశవంతంగా, మేను నునుపుగా, ఆరోగ్యంగా ఉండటంతో పాటు, మన జుట్టు కూడా అంతే ఆరోగ్యంగా, ఒత్తుగా ఎదిగేలా చేయడానికి ఏటీపీ కార్యక్రమం తోడ్పడేందుకు అవకాశం ఉంది. -అంజలి డాంగే అంజలి డాంగే చీఫ్ న్యూట్రిషనిస్ట్, రేవా హెల్త్, స్కిన్, హెయిర్ క్లినిక్, బంజారాహిల్స్, హైదరాబాద్.