పంచపాండవుల ఆలయం | Panchapandavula Temple | Sakshi
Sakshi News home page

పంచపాండవుల ఆలయం

Jan 13 2016 12:10 AM | Updated on Sep 3 2017 3:33 PM

పంచపాండవుల ఆలయం

పంచపాండవుల ఆలయం

శ్రీకృష్ణుడి ఆలయాలు దేశం నలుచెరగులా ఉన్నా, పంచపాండవుల ఆలయాలు

తెలుసుకుందాం

శ్రీకృష్ణుడి ఆలయాలు దేశం నలుచెరగులా ఉన్నా, పంచపాండవుల ఆలయాలు మాత్రం బహు అరుదు. తమిళనాడులోని మహాబలిపురంలో ఇలాంటి అరుదైన ఆలయం ఉంది. కొండగుహలో నిర్మించిన పురాతన ఆలయం ఇది. చెన్నై నుంచి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. పల్లవుల నాటి శిల్పకళా వైవిధ్యానికి నిదర్శనంగా నేటికీ నిలిచి ఉన్న ఈ ఆలయాన్ని క్రీస్తుశకం ఏడో శతాబ్దిలో నిర్మించారు.

యాభై అడుగుల పొడవున ఉన్న కొండగుహ వెలుపల నిర్మించిన రాతి స్తంభాలు, వాటి అడుగున తీర్చిదిద్దిన సింహాల ప్రతిమలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఈ ఆలయం లోపల నిర్మించిన పంచపాండవుల మండపం, రాతిగోడపై శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోపాలకులను రక్షిస్తున్నట్లుగా చెక్కిన శిల్పం నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.
 

Advertisement
 
Advertisement
Advertisement