ఈ ఏడాది దుర్గాపూజ కోసం ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకను మాత్రమే కాదు కూరగాయలు, పండ్లను కూడా ఉపయోగించారు. పది రకాల పండ్లు, ఇరవై రెండు రకాల కూరగాయలతో రూపొందించిన ‘మా దుర్గా’ సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది.
‘పండుగ సమయంలో కళాకారులు అమ్మవారిని వివిధ రూపాల్లో చిత్రించడానికి ప్రయత్నిస్తారు. నాది కూడా అలాంటి ప్రయత్నమే. అమ్మవారిని ప్రత్యేక రూపంలో ప్రదర్శిస్తూ, కళాకృతిని మించిన సందేశాన్ని అందించడమే నా ఉద్దేశం’ అంటున్నారు సుదర్శన్ పట్నాయక్.


