breaking news
sand artist Sudarsan Pattnaik
-
సైకత శిల్పంలో వందేళ్ల ఆర్ఎస్ఎస్.. వ్యవస్థాపకులకు పట్నాయక్ నివాళులు
భువనేశ్వర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేడు (విజయ దశమి) వందవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమయ్యింది. ఈ చారిత్రాత్మక మైలురాయిని గుర్తుచేస్తూ పద్మశ్రీ అవార్డు గ్రహీత, అంతర్జాతీయంగా పలువురు ప్రశంసలు పొందిన సైకత శిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో ‘100 ఏళ్ల నిస్వార్థ సేవ’ అనే సందేశంతో అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు.ఎనిమిది టన్నుల ఇసుకతో రూపొందించిన ఈ ఆరు అడుగుల పొడవైన కళాకృతిలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ (గురూజీ)లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ మాట్లాడుతూ ‘వందేళ్ల ఆర్ఎస్ఎస్ అందించిన క్రమశిక్షణ, నిస్వార్థ సేవా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. 65కి పైగా అంతర్జాతీయ శాండ్ ఆర్ట్ ఈవెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన పట్నాయక్.. వాతావరణ మార్పు, ప్రజారోగ్యం తదితర సామాజిక సమస్యలపై అవగాహన పెంచేందుకు సైకత కళను ప్రదర్శిస్తుంటారు. #RSS100Years | Padma Shri Sudarsan Pattnaik, the acclaimed sand artist, created a magnificent sand art at Puri Beach, offering a cultural salute to the Rashtriya Swayamsevak Sangh (RSS) as it celebrates its Centenary Year.The artwork features RSS founder Dr. K.B. Hedgewar on… pic.twitter.com/NQzum7KRRP— Organiser Weekly (@eOrganiser) October 1, 20251925లో నాగ్‌పూర్‌లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. పౌరులలో సాంస్కృతిక అవగాహన, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించడానికి ఏర్పడిన స్వచ్ఛంద సేవా సంస్థగా ఇది ప్రారంభమైంది. గత వందేళ్లలో ఆర్ఎస్ఎస్ భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన సామాజిక-సాంస్కృతిక సంస్థలలో ఒకటిగా నిలిచింది. వరదలు, భూకంపాలు, తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం అందించడంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు. -
శ్రీదేవి సైకత శిల్పంతో నివాళి!
-
కథగా..కల్పనగా తరలిపోయిన తారకు నివాళి!
సాక్షి, ముంబై: అభిమాన అందాల నటి శ్రీదేవి ఇకలేరన్న (ఫిబ్రవరి 24) పిడుగులాంటి వార్తతో యావత్తు సినీ జగత్తు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఆమె అభిమానులు తీరని విషాదంలో మునిగిపోయారు. సినీ ప్రపంచంలో ధృవతారలా వెలిగిన మెగాస్టార్ శ్రీదేవి హఠాన్మరణంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. వీరితోపాటు వివిధ రంగాలకు చెందిన కళాకారులు, కార్టూనిస్టులు, ఇతర ప్రముఖులు కూడా ఆమె మరణం పట్ల అంతులేని ఆవేదన ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిషాలోని పూరీ బీచ్‌లో ఆర్ఐపీ శ్రీదేవి అంటూ సైకత శిల్పంతో ప్రత్యేక నివాళులర్పించారు ప్రఖ్యాత సంపాదకీయ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య కూడా భావోద్వేగాన్ని తన ఆర్ట్ ద్వారా ప్రకటించారు. దేవుని ఒడిలో శ్రీదేవి నిద్రపోతున్నట్టుగా ఒక స్కెచ్‌ను వేశారు. 'రా రె రారామ్, ఓ రా రీ రమ్' (సద్మా, తెలుగులో వసంతకోకిల మూవీలోని పాట) రూపొందించిన కార్టూన్ ఆమె అభిమానుల్లో కంట నీరు పెట్టిస్తోంది. కాగా సమీప బంధువు వివాహ వేడుక కోసం దుబాయ్ వెళ్లిని శ్రీదేవి తీవ్రమైన గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం సోమవారం ముంబై జుహూలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రిలయన్స్ క్యాపిటల్ అధినేత అనిల్ అంబానీకి చెందిన ప్రత్యేక విమానంలో శ్రీదేవి భౌతికకాయం ముంబైలోని ఆమె నివాసానికి చేరనుంది. Tribute to one of the brightest star of Indian cinema #Sridevi . My SandArt at Puri beach in Odisha with message "We will miss you" . #RIPSridevi pic.twitter.com/NuMYnKWnO7 — Sudarsan Pattnaik (@sudarsansand) February 25, 2018 Chandni! @mail_today cartoon #Sridevi #Chandni pic.twitter.com/I6ZrPDQ06n — Satish Acharya (@satishacharya) February 26, 2018 Tribute to one of the brightest star of Indian cinema #Sridevi . My SandArt at Puri beach in Odisha with message "We will miss you" . #RIPSridevi pic.twitter.com/NuMYnKWnO7 — Sudarsan Pattnaik (@sudarsansand) February 25, 2018 -
పూరీ తీరంలో సింధు సైకతశిల్పం
భువనేశ్వర్: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత బ్యాడ్మిటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సింధు, కోచ్ గోపీచంద్‌లను అభినందిస్తూ ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో చక్కటి శిల్పాన్ని తయారుచేశారు. ఒడిశాలో పూరీ సముద్రతీరంలో ఐదు అడుగుల ఎత్తైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇంగ్లీష్‌లో కంగ్రాట్స్ పీవీ సింధు, థ్యాంక్స్ గోపీచంద్ అనే అక్షరాలతో పాటు బ్యాడ్మింటన్ ఆడుతున్నట్టుగా సింధు ప్రతిమ ఉంది. సుదర్శన్ పట్నాయక్ ఈ శిల్పం తయారు చేయడానికి నాలుగు టన్నుల ఇసుకను వాడారు. ఒలింపిక్స్‌లో సింధు పతకం సాధించడాన్ని దేశం గర్విస్తోందని, ఆమె విజయం వెనుక కోచ్ గోపీచంద్ ఉన్నాడని ప్రశంసించారు. సమాజంలో ఆయా పరిస్థితులకు, పరిణామాలకు సందర్భోచితంగా విలక్షణ శైలిలో సైకత శిల్పాలను రూపొందించడం సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేకత.


