చరిత్రలో ఈ రోజు | one day in a history | Sakshi
Sakshi News home page

చరిత్రలో ఈ రోజు

Feb 18 2014 11:10 PM | Updated on Sep 2 2017 3:50 AM

చరిత్రలో ఈ రోజు

చరిత్రలో ఈ రోజు

తూర్పు కజకిస్తాన్‌లో రష్యా రిపబ్లిక్ అణుపరీక్ష నిర్వహించింది (1984). మురౌరా దీవిలో ఫ్రాన్స్ అణుపరీక్ష నిర్వహించింది (1977). రష్యా స్పుత్నిక్ 52, మోల్నియా 1-13 సమాచార ఉపగ్రహాలను ప్రయోగించింది (1970).

 కప్పు - సాసర్
 
 చరిత్రలో ఈ రోజు
 
     తూర్పు కజకిస్తాన్‌లో రష్యా రిపబ్లిక్ అణుపరీక్ష నిర్వహించింది (1984).
     మురౌరా దీవిలో ఫ్రాన్స్ అణుపరీక్ష నిర్వహించింది (1977).
     రష్యా స్పుత్నిక్ 52, మోల్నియా 1-13 సమాచార ఉపగ్రహాలను ప్రయోగించింది (1970).
 
 ఓ నిమిషం
     స్నానం ముగించే ముందు పమిస్ స్టోన్‌తో పాదాలను సున్నితంగా రుద్ది కడగాలి. ఇలా చేస్తే మృతకణాలతోపాటు పాదాలకంటిన దుమ్ము పూర్తిగా పోతుంది. పొడి చర్మం అయితే స్నానం పూర్తయిన తర్వాత పాదాలను తడి లేకుండా తుడిచి ఏదైనా ఆయిల్ కానీ, క్రీమ్ కానీ రాస్తే మంచిది.
 
 ఓ విషయం
     మనదేశంలో ఎడారుల విస్తీర్ణం 2,25,000 చ. కి.మీలు.  
     ఎడారి గ్రామాల్లో నీటిని నిల్వ చేయడానికి జోహాద్ (ఊరంతటికీ సరిపోయే పెద్ద సిమెంట్ తొట్టి)లను నిర్మిస్తారు. ఇందులో వర్షపునీటిని నిల్వ చేస్తారు.
 
 ఓ ప్రయోగం
     కరెంట్ పోయినప్పుడు ఇంట్లో సృజనాత్మకమైన దీపాన్ని వెలిగించే ఆలోచన ఇది. ఒక రీచార్జబుల్ లైట్‌ఎమిటింగ్ డయోడ్ (ఎల్‌ఈడీ), ఖాళీ వైన్‌బాటిల్ ఉంటే చాలు. చీకటింటిని ఒక రొమాంటిక్ స్పాట్‌గా మార్చేయవచ్చు! బ్రిటన్‌కు చెందిన ఒక ఎలక్ట్రానిక్  వస్తువుల తయారీ కంపెనీ ఈ ‘బాటిల్‌లైట్’కు రూపకల్పన చేసింది. గంటసేపు చార్జింగ్ పెడితే ఆ ఎల్‌ఈడీ దాదాపు రెండున్నర గంటలు వెలుగుతుంది. యూఎస్‌బీ సాకెట్ ద్వారా ఎల్‌ఈడీకి చార్జింగ్ పెట్టచ్చు. దీని ధర సుమారు వెయ్యి రూపాయలు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement