రాష్ట్రంలో పెట్టుబడులు సురక్షితం | Chief Minister Revanth Reddy with a delegation of UK mayors | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పెట్టుబడులు సురక్షితం

Oct 15 2026 1:32 AM | Updated on Oct 15 2026 1:32 AM

Chief Minister Revanth Reddy with a delegation of UK mayors

యూకే మేయర్ల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

రానున్న రోజుల్లో తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి

డిసెంబర్‌ 7–9 తేదీల్లో ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌

బ్రిటన్‌ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు విధానపరమైన కొనసాగింపు ఉంటుందని, పెట్టుబ డులు సురక్షితంగా ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి బ్రిటన్‌ ప్రతినిధి బృందానికి భరోసా ఇచ్చారు. నైపుణ్యం కలి గిన మానవ వనరులు, అనుకూల వ్యాపార వాతా వరణం తెలంగాణకు బలమని చెప్పారు. ప్రపంచంలోని ఇతర రాష్ట్రాలతో తెలంగాణ పోటీపడుతోందని, రానున్న కొన్నే ళ్లలో తయారీ రంగం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమి స్తామని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో బ్రిటన్‌లోని యార్క్‌షైర్‌ ప్రాంతానికి చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సీఎం సమావేశమ య్యారు. 

దక్షిణ యార్క్‌షైర్‌ మేయర్‌ ఒలివర్‌ కాప్‌కార్డ్, వెస్ట్‌ యార్క్‌షైర్‌ మేయర్‌ ట్రేసీ బ్రాబిన్, యార్క్‌ అండ్‌ నార్త్‌ యార్క్‌షైర్‌ మేయర్‌ డేవిడ్‌ స్కైత్‌ ఈ బృందానికి నేతృత్వం వహించారు. భారత్‌–బ్రిటన్‌ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో తెలంగాణ, యూకే ప్రాంతాల మధ్య వాణి జ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, విద్య, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు. దేశంలోనే అతి పిన్న వయసున్న రాష్ట్రంగా తెలంగాణ ఐటీ, ఔషధాలు, జీవశాస్త్రాలు, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, రక్షణ, ఎల క్ట్రానిక్స్‌ తయారీ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తోందని సీఎం వివరించారు. డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026కు బ్రిటన్‌ పెట్టుబడి­దారులు, పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు.

నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక విశ్వవిద్యాలయం
కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం ఈ సందర్భంగా తెలి పారు. పరిశ్రమల భాగస్వామ్యంతో నేరుగా నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూని­వర్సిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. తెలంగాణ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక ‘తెలంగాణ రైజింగ్‌–2047’ రూపకల్పన లో బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ కీలకమైన విజ్ఞాన భాగస్వామిగా వ్యవహరించారని చెప్పా­రు.

30 వేల ఎకరాల్లో ప్రపంచస్థాయి ఉపగ్రహ నగరంగా అభివృద్ధి చేయ నున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీ మాస్టర్‌ప్లాన్‌ను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. మూaసీ నదిని పునరుజ్జీవింపజేసి, నదీతీర ఆర్థిక కార్యకలాపాలు, రాత్రివేళ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ప్రణాళికను వివరించారు. ఈ సందర్భంగా యూకే–ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రూపొందించిన ‘యూకే–ఇండియా సీఈటీఏ అండ్‌ రీజినల్‌ సినర్జీస్‌’ నివేదికను సీఎం ఆవిష్కరించారు.

తెలంగాణతో భాగస్వామ్యంపై ఆసక్తి
అధునాతన తయారీ, వైద్యం, డిజిటల్‌ సాంకేతికత, రక్షణ, ఏరోస్పేస్, సాంకేతిక వస్త్రాలు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేయడానికి యూకే ప్రతినిధులు ఆసక్తి చూపారు. వివిధ రంగాల్లో 1.50 లక్షల వ్యాపార సంస్థలు కలిగిన యార్క్‌షైర్‌కు, తెలంగాణకు అనేక ఉమ్మడి ప్రయోజనాలు­న్నాయని దక్షిణ యార్క్‌షైర్‌ మేయర్‌ ఒలివర్‌ కాప్‌కార్డ్‌ చెప్పారు.

తెలంగాణ, యార్క్‌షైర్‌ మధ్య అనేక సారూప్య­తలు, ఉమ్మడి ప్రయో జనాలున్నాయని, తాము సోదరసోద­రీమణుల్లాంటి వార మని వెస్ట్‌ యార్క్‌షైర్‌ మేయర్‌ ట్రేసీ బ్రాబిన్‌ వ్యాఖ్యా నించారు. ఈ సమావేశంలో యూకే–ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ సీఈవో కిశోర్‌ జయ రామన్, బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషన్‌ ప్రతినిధులు,  సీఎస్‌ సంజయ్‌ జాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రపంచస్థాయి వర్సిటీలకు కేంద్రంగా తెలంగాణ:  శ్రీధర్‌బాబు
ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు తెలంగాణ నిలయంగా మారే దిశగా ముందుకు సాగుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు చెప్పారు. ఇటీవల సీఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం బ్రిటన్‌ పర్యటనలో ప్రముఖ విశ్వవిద్యాల­యాలు, వ్యాపార సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుందని తెలిపారు. హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీ, అక్కడి ఆవిష్కరణల వ్యవస్థను పరిశీలించాలని యూకే ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement