మే 16న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On May 16, the birthday celebrated | Sakshi
Sakshi News home page

మే 16న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

May 15 2015 11:09 PM | Updated on Sep 3 2017 2:06 AM

మే 16న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

మే 16న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

వీరి వ్యక్తిగత సంఖ్య రెండు కావడం వల్ల ఈ సంవత్సరం కొద్దిపాటి ఒడుదొడుకులతో కూడుకుని ఉంటుంది.

ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
 జానెట్ జాక్సన్ (పాప్ సింగర్), సోనాల్ చౌహాన్ (నటి)

 
వీరి వ్యక్తిగత సంఖ్య రెండు కావడం వల్ల ఈ సంవత్సరం కొద్దిపాటి ఒడుదొడుకులతో కూడుకుని ఉంటుంది. కొత్తప్రాజెక్టుల జోలికి వెళ్లకుండా, పాత వాటినే కొనసాగించడం మంచిది. జ్యోతిషం, వైద్యవిద్య, న్యూమరాలజీ వంటి కోర్సులను అధ్యయనం చేయాలనుకున్న వారి కోరిక నెరవేరుతుంది. తోబుట్టువులకు జీవితంలో చాలా వృద్ధికరంగా ఉంటుంది.

అన్ని పనులలోనూ ఆలస్యం, అవాంతరాలు ఎదురయే అవకాశాలు ఉన్నందువల్ల నిరుత్సాహానికి లోనుకాకుండా జాగ్రత్తగా పనులు పూర్తి చేసుకోవాలి. చదువు విషయంలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, పరిశోధన రంగంలో ఉన్న విద్యార్థులకు డాక్టరేట్ వస్తుంది. లక్కీ నంబర్లు: 1,2,6,7, కలర్స్: గ్రే, గ్రీన్, వయొలెట్, లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు. చిత్రగుప్తుడి నోము నోచుకోవడం లేదా ఆలయాన్ని సందర్శించడం, అనాథలకు అన్నదానం చేయడం, దేవాలయాలలో అన్నదానానికి డబ్బులు కట్టడం వల్ల బాగా కలిసొస్తుంది.
 - ఆర్. దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement