breaking news
Janet Jackson
-
అభిమానుల కోసం బొమ్మలా..
లాస్ ఏంజిల్స్: సెలబ్రెటీలు తమ అభిమానులను అలరించడానికి అనేక ఫీట్లు చేస్తుండడం చూస్తూనే ఉంటాం. అయితే ప్రముఖ అమెరికన్ పాప్ గాయిని, మైఖేల్ జాక్సన్ చెల్లెలు జానెట్ జాక్సన్ మాత్రం వినూత్నంగా ఆలోచించి అభిమానుల కోసం బొమ్మలా మారిపోయారు. వివరాల్లోకి వెళ్తే..జానెట్ జాక్సన్ తన 'మై మ్యూజిక్ వీఐపీ మ్యూజియం'ను చూడడానికి వచ్చిన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. నల్లని రంగు కాస్ట్యూమ్స్ ధరించిన జాక్సన్ కళ్లు మూసుకొని మ్యూజియంలో బొమ్మలా నిల్చుంది. మ్యూజియంలోని విశేషాలను ఆసక్తిగా తిలకిస్తున్న అభిమానులు జానెట్ను చూసి నిజంగానే బొమ్మ అని భ్రమపడ్డారు. కాసేపటి తరువాత బొమ్మ కదులుతుండడం గమనించి.. అది తమ అభిమాన సింగర్ జానెట్ జాక్సన్ అని గుర్తించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తరువాత అభిమానులతో కాసేపు సరదాగా గడిపిన జానెట్ తన రాబోయే ఆల్బమ్ 'అన్బ్రేకబుల్'కు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ఈ ఊహించని పరిణామంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. -
మే 16న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: జానెట్ జాక్సన్ (పాప్ సింగర్), సోనాల్ చౌహాన్ (నటి) వీరి వ్యక్తిగత సంఖ్య రెండు కావడం వల్ల ఈ సంవత్సరం కొద్దిపాటి ఒడుదొడుకులతో కూడుకుని ఉంటుంది. కొత్తప్రాజెక్టుల జోలికి వెళ్లకుండా, పాత వాటినే కొనసాగించడం మంచిది. జ్యోతిషం, వైద్యవిద్య, న్యూమరాలజీ వంటి కోర్సులను అధ్యయనం చేయాలనుకున్న వారి కోరిక నెరవేరుతుంది. తోబుట్టువులకు జీవితంలో చాలా వృద్ధికరంగా ఉంటుంది. అన్ని పనులలోనూ ఆలస్యం, అవాంతరాలు ఎదురయే అవకాశాలు ఉన్నందువల్ల నిరుత్సాహానికి లోనుకాకుండా జాగ్రత్తగా పనులు పూర్తి చేసుకోవాలి. చదువు విషయంలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, పరిశోధన రంగంలో ఉన్న విద్యార్థులకు డాక్టరేట్ వస్తుంది. లక్కీ నంబర్లు: 1,2,6,7, కలర్స్: గ్రే, గ్రీన్, వయొలెట్, లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు. చిత్రగుప్తుడి నోము నోచుకోవడం లేదా ఆలయాన్ని సందర్శించడం, అనాథలకు అన్నదానం చేయడం, దేవాలయాలలో అన్నదానానికి డబ్బులు కట్టడం వల్ల బాగా కలిసొస్తుంది. - ఆర్. దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్