జూలై7న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On July 7, the birthday celebrated | Sakshi
Sakshi News home page

జూలై7న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jul 6 2015 10:45 PM | Updated on Sep 3 2017 5:01 AM

జూలై7న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

జూలై7న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 4. ఇది రాహువుకు సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరి జీవితంలో ఈ సంవత్సరం ఎంతో

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: మహేంద్రసింగ్ ధోని (క్రికెటర్);
 కైలాష్ ఖేర్ (గాయకుడు)

 
ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 4. ఇది రాహువుకు సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరి జీవితంలో ఈ సంవత్సరం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఆకస్మిక మార్పులు జరగవచ్చు. అంతేకాదు, లాభదాయకమైన సంబంధాలు, అదృష్టం కలిగించే సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకోవచ్చు. అదేవిధంగా మీ బర్త్‌డేలో రెండు ఏడులు ఉన్నాయి. దీనివల్ల మీకు ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన ఉంటుంది. జరగబోయే సంఘటనలు మీకు ముందుగానే కలల రూపంలో తెలుస్తాయి. మీ వాక్కు ఫలిస్తుంది. అందువల్ల  ఎప్పుడూ మంచినే కోరుకోండి. కేతుగ్రహ ప్రభావం వల్ల కొద్దిపాటి ఆందోళనలు, సమస్యలు ఎదురవ వచ్చు. అవన్నీ తాత్కాలికమే అని గ్రహించి, వైవాహిక జీవితంపై శ్రద్ధ పెట్టండి. చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు మీకు అనుకూలంగా వస్తాయి. తొందరపడి ఇతరుల విషయాల్లో తలదూర్చకండి. మీపై నిందలు, కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

 లక్కీ నంబర్స్: 1,2,4,6,7; లక్కీ కలర్స్: గ్రే, క్రీమ్, గోల్డెన్, శాండల్, వయోలెట్; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ వారాలు.
 సూచనలు: రాహుకేతు జపం చేయించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం, పేదలకు, మదరసాలలోని వారికి అన్నదానం చేయించడం మంచిది.   
 - రెహమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement
 
Advertisement
Advertisement