జూలై 17 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On July 17, the birthday celebrated | Sakshi
Sakshi News home page

జూలై 17 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jul 16 2015 11:33 PM | Updated on Sep 3 2017 5:37 AM

జూలై  17 న  పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

జూలై 17 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధునికి సంకేతం.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
జరీనా వాహబ్ (నటి); భారతీరాజా (దర్శకుడు)
 

ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధునికి సంకేతం. పుట్టిన తేదీ 17 అంటే 8. శని దీనికి అధిపతి. బుధ శనులకు మిత్రత్వం ఉన్నందువల ఈ సంవత్సరం వీరికి చాలా బాగుంటుంది. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు. వివాహం కాని వారికి వివాహమవుతుంది. కొత్త టెక్నాలజీ, కొత్త విషయాలు నేర్చుకుని వారి నైపుణ్యాన్ని పెంచుకోవడం వల్ల ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. కొత్త ఆస్తులు కొనడం గాని, ఉన్న ఆస్తులు అభివృద్ధి చేయడం గానీ చేస్తారు.

పోటీపరీక్షలు రాసేవారికి, క్రీడాకారులకు విజయం లభిస్తుంది. అలాగే కోర్టు కేసులలో కూడా విజయం లభిస్తుంది. ఆత్మస్తుతి తగ్గిస్తే బాగుంటుంది. 35 సంవత్సరాలు దాటిన వారికి మరింత అభివృద్ధికరంగా ఉంటుంది. పని వారిపట్ల, వారి సంక్షేమం పట్ల బాధ్యతగా ఉండటం మంచిది.

లక్కీ నంబర్స్: 3,4,5,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, బ్లూ, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: గురు; శుక్ర, శనివారాలు
 సూచనలు: అనాథలను ఆదుకోవడం, తల్లిని, తత్సమానులను ఆదరించడం, కుక్కలకు చపాతీలు పెట్టడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 

Advertisement
 
Advertisement
Advertisement