డిసెంబర్ 4న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On December 4 birthday Celebrities | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 4న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Dec 3 2015 11:38 PM | Updated on Sep 3 2017 1:26 PM

డిసెంబర్  4న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

డిసెంబర్ 4న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
జావెద్ జాఫ్రీ (యాక్టర్), అజిత్ అగార్కర్ (క్రికెటర్)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రునికి సంబంధించినది కావడం వల్ల పుట్టుకతోనే సౌకర్యాలు, డబ్బు, సంతోషం, విలాసవంతమైన జీవనం అలవడతాయి. ఎల్లప్పుడూ అంద ంగా, యవ్వనంగా కనిపిస్తారు. ఏ ఆటంకాలూ లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. అందరికీ ఇష్టులుగా మారతారు. అంచెలంచెలుగా జీవితంలో పైకి వస్తారు. ఈ రోజు పుట్టిన తేదీ 4. ఇది రాహువుకు సంబంధించినది కావడం వల్ల ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటాయి. సొంత ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది. ఎన్నో ఏళ్లుగా కోర్టులో ఆస్తికి సంబంధించి నలుగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి.

అయితే కొన్ని అదనపు బరువు బాధ్యతలు మీదపడి, మీరే నెరవ్చేవలసి వస్తుంది. దీనివల్ల ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవడం అవసరం. అలాగే కొత్తగా కోర్టు వివాదాలలో తలదూర్చకుండా, వివాదాల జోలికి పోకుండా సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ఈ సంవత్సరం విజయాలతోబాటు, శ్రమ కూడా తప్పదు.  లక్కీ నంబర్స్: 2,4,6; లక్కీ కలర్స్: బ్లూ, వైట్, వయొలెట్, గోల్డెన్, శాండల్; లక్కీడేస్: సోమ, గురు, శుక్రవారాలు; జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, అక్టోబర్, నవంబర్
 సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుదర్శన హోమం చేయించడం, అనాథలకు అన్నదానం, శుక్రజపం చేయించడం, రోజూ లక్ష్మీ అష్టోత్తరం పఠించడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement
 
Advertisement
Advertisement