Javed Jaffrey
-
'బోల్ బేబీ బోల్'తో సెన్సేషన్.. ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్‌తో మరోసారి వైరల్
‘‘బోల్ బేబీ బోల్...’’ పాట గుర్తుందా? ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ... ఒకప్పుడు యూత్ మొత్తాన్ని ఊపేసిన బాలీవుడ్ పాట ఇది! పాటెలా ఉన్నా.. దానికి స్టెప్పులేసిన జావేద్ జాఫ్రీ... ఒక్కదెబ్బకు బాగా పాపులర్ అయిపోయాడు కూడా! ఆ తరువాత ఎన్నో సినిమాల్లో ఆర్టిస్ట్‌గా, టీవీ షో జడ్జిగా పనిచేసిన జావేద్ జాఫ్రీ.. ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాడు. ఎందుకంటే.. 61 ఏళ్ల వయసులోనూ యూత్‌కు కిర్రాక్ తెప్పించే స్థాయిలో బ్రేక్‌డ్యాన్స్ ఆడేశాడు మరి! నమ్మకం కుదరకపోతే.. @yoursJoee హ్యాండిల్ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేసిన వీడియో కింద చూసేయండి!జావేద్ జాఫ్రీ తన నటనా జీవితాన్ని 1985లో మేరీ జంగ్ (Meri Jung) చిత్రంతో ప్రారంభించాడు. ఈ చిత్రంలోని "బోల్ బేబీ బోల్ రాక్ అండ్ రోల్" పాటలో అతని అద్భుతమైన నృత్యం అతనికి తక్షణ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ పాటలో అతను విక్రమ్ ఠాక్రాల్ అనే పాత్రలో కనిపించాడు. తన డ్యాన్స్ స్టైల్‌తో 80వ దశకంలో యువతను ఆకర్షించాడు. javed jaffrey’s moves at 61... unreal, absolute LEGENDARY stuff! pic.twitter.com/w5Y06VJvho— Joe (@YoursJoee) April 1, 2025చదవండి: లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు -
మనీగ్రామ్ రంజాన్ ఆఫర్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగదు బదిలీ సేవల రంగంలో ఉన్న మనీగ్రామ్.. రంజాన్ ఆఫర్‌ను ప్రకటించింది. బాలీవుడ్ నటుడు జావెద్ జాఫ్రీ శుక్రవారమిక్కడ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. జూన్ 6 నుంచి మొదలై రంజాన్ నెల పూర్తి అయ్యే వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ప్రథమ బహుమతి కింద ఇద్దరు వ్యక్తులకు ఉమ్రా (మక్కా) వె ళ్లే అవకాశం లభిస్తుంది. రానుపోను అన్ని ఖర్చులను కంపెనీయే భరిస్తుంది. టెలివిజన్ సెట్స్, స్మార్ట్ఫోన్లు సైతం గెలుపొందవచ్చని కంపెనీ తెలిపింది. ఉచితంగా అంతర్జాతీయ కాల్స్ చేసుకునే అవకాశమూ ఉంది. విదేశాల నుంచి మనీగ్రామ్ ద్వారా నగదును స్వీకరించే కస్టమర్లు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులు. తెలంగాణ, బిహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో ఈ క్యాంపెయిన్‌ను కంపెనీ నిర్వహిస్తోంది. -
డిసెంబర్ 4న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు జావెద్ జాఫ్రీ (యాక్టర్), అజిత్ అగార్కర్ (క్రికెటర్) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రునికి సంబంధించినది కావడం వల్ల పుట్టుకతోనే సౌకర్యాలు, డబ్బు, సంతోషం, విలాసవంతమైన జీవనం అలవడతాయి. ఎల్లప్పుడూ అంద ంగా, యవ్వనంగా కనిపిస్తారు. ఏ ఆటంకాలూ లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. అందరికీ ఇష్టులుగా మారతారు. అంచెలంచెలుగా జీవితంలో పైకి వస్తారు. ఈ రోజు పుట్టిన తేదీ 4. ఇది రాహువుకు సంబంధించినది కావడం వల్ల ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటాయి. సొంత ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది. ఎన్నో ఏళ్లుగా కోర్టులో ఆస్తికి సంబంధించి నలుగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి. అయితే కొన్ని అదనపు బరువు బాధ్యతలు మీదపడి, మీరే నెరవ్చేవలసి వస్తుంది. దీనివల్ల ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవడం అవసరం. అలాగే కొత్తగా కోర్టు వివాదాలలో తలదూర్చకుండా, వివాదాల జోలికి పోకుండా సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ఈ సంవత్సరం విజయాలతోబాటు, శ్రమ కూడా తప్పదు. లక్కీ నంబర్స్: 2,4,6; లక్కీ కలర్స్: బ్లూ, వైట్, వయొలెట్, గోల్డెన్, శాండల్; లక్కీడేస్: సోమ, గురు, శుక్రవారాలు; జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, అక్టోబర్, నవంబర్ సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుదర్శన హోమం చేయించడం, అనాథలకు అన్నదానం, శుక్రజపం చేయించడం, రోజూ లక్ష్మీ అష్టోత్తరం పఠించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్