బార్బీలకు న్యూ లుక్

కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ప్రొఫెషన్‌లలో బార్బీడాల్స్ కనిపించబోతున్నాయి! మెరైన్ బయాలజిస్ట్, ఆస్ట్రోఫిజిసిస్ట్, ఫొటోజర్నలిస్ట్, కన్సర్వేషనిస్ట్, ఎంటోమాలజిస్ట్ బార్బీలను డిజైన్ చేయడం కోసం ఆ బొమ్మల తయారీ సంస్థ.. నిజ జీవితంలోని సంబంధిత వృత్తి నిపుణుల సలహాలను తీసుకుంటున్నాయి. చూడగానే ఫలానా ప్రొఫెషన్ అని పిల్లలు గుర్తుపట్టే వి«ధంగా ఈ బార్బీలు ఉంటాయి. భారతీయ సంతతికి చెందిన ఫారెస్ట్ ఎకాలజిస్ట్ నళినీ నాదకర్ణి.. ‘సైంటిస్ట్ ఎక్స్‌ప్లోరర్’ (అన్వేషించే శాస్త్రవేత్త) బార్బీని డిజైన్ చేసేందుకు ఆ సంస్థకు తోడ్పడుతున్నారు. ఆరేళ్ల తన కుమార్తె తనకు సైంటిస్ట్ బార్బీ కావాలని కోరినప్పుడు సైటిస్ట్ అని గుర్తుపట్టేందుకు అవసరమైన డిజైనింగ్ గురించి అప్పటినుంచే ఆమె ఆలోచిస్తూ ఉండగా ఇప్పుడీ అవకాశం వచ్చింది. అమ్మే స్వయంగా డిజైన్ చేసిన బార్బీ కొద్ది రోజుల్లోనే కూతురి చేతుల్లోకి రాబోతోందన్న మాట.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి