అంతగా నచ్చింది మరి! | Miss the chance to work pariniti chopra | Sakshi
Sakshi News home page

అంతగా నచ్చింది మరి!

Jul 26 2015 11:04 PM | Updated on Sep 3 2017 6:13 AM

అంతగా నచ్చింది మరి!

అంతగా నచ్చింది మరి!

‘సల్మాన్‌ఖాన్ బ్యానర్‌లో నటించే అవకాశం మిస్ అయిందట కదా...

‘సల్మాన్‌ఖాన్ బ్యానర్‌లో నటించే అవకాశం మిస్ అయిందట కదా... ఏడ్వక ఏంచేస్తుంది!’ అనుకోవద్దు.
పరిణీతి చోప్రా ఏడ్చింది నిజంగా అందుకు కాదు.
అంతకుముందే ఆమె ‘మసాన్’ సినిమా చూసింది. సినిమా చూస్తున్నప్పుడు భావోద్వేగానికి లోనై గట్టిగా ఏడ్చేసింది. పక్క సీటు వాళ్లు సినిమా చూడడం మాని, పరిణీతిని ఊరడించడానికే తమ సమయాన్ని కేటాయించారట. కొందరైతే ‘ఇదెక్కడి గోలరా బాబు’ అని వెనక సీట్లోకి పారిపోయారట.
‘‘ఎవరినీ డిస్టర్బ్ చేయడానికి నేను ఏడవలేదు. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను... ఆ సినిమా చూసి ఏడవకుండా ఎవరూ ఉండలేరు’’ అని చెప్పింది పరిణీతి.
అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను అందుకున్న ‘మసాన్’ సినిమా పరిణీతిని ఎంతో ఆకట్టుకుందట.
అందుకే ‘‘ఈ సినిమాను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడాలి’’ అని అందరితోనూ  చెబుతోంది.
మ్యాటర్ అక్కడితో ఆగిపోలేదు... తాజా విషయం ఏమిటంటే ఈ సినిమా దర్శకుడు నీరజ్ గైవాన్‌ను పరిణీతి పొగడ్తలతో ముంచెత్తిందట. అంతేకాదు...
‘‘మీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో నాకు అవకాశం ఇవ్వండి. ఎంత చిన్న పాత్ర అయినా చేస్తాను’’ అని నోరు విప్పి అడిగిందట.
అటు నుంచి ఎలాంటి రిప్లై వచ్చిందనేది తరువాత విషయంగానీ... భావోద్వేగంలో పూర్తిగా మునిగిపోవడం వల్లే పరిణీతి ఆ మాట అన్నదని, నిజానికి పాత్ర, పారితోషికం విషయంలో ఎలాంటి రాజీ పడదని ఆమె గురించి తెలిసినవాళ్లు చాటుమాటుగా అంటున్నారు.
వింటున్నారా నీరజ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement