కూతుర్ని తిట్టిన తండ్రి | Meghan Markle Father Abuses Daughter | Sakshi
Sakshi News home page

కూతుర్ని తిట్టిన తండ్రి

Jan 22 2020 2:52 AM | Updated on Jan 22 2020 2:52 AM

Meghan Markle Father Abuses Daughter - Sakshi

‘‘ఆ మహా తల్లి బ్రిటన్‌ రాచకుటుంబాన్ని వేరు చేసింది’’ అని మేఘన్‌ మార్కల్‌ను నిందిస్తున్న వారికి ఇప్పుడు మరొక వ్యక్తి తోడయ్యారు. ఆ వ్యక్తి ఎవరో కాదు. మేఘన్‌ను కన్న తండ్రి థామస్‌. ‘‘అల్లుడు గారు ఒప్పుకుంటే నేను కూడా బ్రిటన్‌ షిఫ్ట్‌ అయిపోయి మీతోనే ఉంటాను’’ అని అడిగి, కూతురి చేత చీవాట్లు తిన్న థామస్‌.. ఇప్పుడు కూతుర్ని నిందించడానికి అవకాశం దొరికినవాడిలా.. కనిపించిన ప్రతివారి ముందూ ఆమెను చులకన చేసి మాట్లాడుతున్నాడు. ‘‘ఎంత గొప్ప కుటుంబం రాణిగారిది! ఆ కుటుంబాన్ని పలచన చేసేసింది.

ఛ. నా కూతురు అని చెప్పుకోడానికే సిగ్గుగా ఉంది’’ అంటున్నాడాయన! ‘‘అవునా.. మీరు ఆ కుటుంబాన్ని పలచన చేశారన్న మీ తండ్రి మాటలు నిజమేనా?’’ అనే ప్రశ్నకు మేఘన్‌ సమాధానం చెప్పే అగత్యం లేకుండా.. ఆమెను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రిన్స్‌ హ్యారీ.. ‘‘నన్నడగండి చెబుతాను’’అని ముందుకు వస్తున్నారు. ‘‘మేఘన్‌ రాకతో మా కుటుంబం మరింత గౌరవనీయం’’ అయింది అంటున్నాడు. భర్తే సపోర్ట్‌గా నిలబడ్డాక ప్రపంచం ఎన్ననుకుంటేనేం?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement