మామిడి ఉపయోగాలు

Mango fruit prevents the problem of high blood pressure - Sakshi

►మామిడి పండును పండ్లలో రారాజుగా పిలుస్తారు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం... అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. విటమిన్‌ సి, ఫైబర్‌... శరీరంలో హాని చేసే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి
►మామిడి పండును తినడం వల్ల పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి
►నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు శుభ్రపడతాయి. పంటిపై ఎనామిల్‌ కూడా దృఢంగా ఉంటుంది
►మామిడి పండు మంచి జీర్ణకారి ∙ఇది అజీర్ణం, అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది
►మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజమైన బరువు పెరిగే అవకాశం ఉంది
►ఇందులో ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడి పండ్లు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్‌ ఎర్ర రక్త కణాల వృద్ధికి దోహదపడుతుంది
►ఈ పండులో ఉండే విటమిన్లు, ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది
►వృద్ధాప్య సమస్యలను తగ్గిస్తుంది
►చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది
►మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది 
►శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచే బీటా కెరటిన్‌ అనే పదార్థం సమృద్ధిగా ఉంది. ఇది మన శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది
►మామిడి పండుకి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది భారతదేశపు జాతీయఫలం.

పాదాల పగుళ్లు: మామిడి జిగురు తీసుకుని, ఆ పరిమాణానికి మూడు రెట్లు నీళ్లు కలిపి పేస్టులా చేసి, ప్రతిరోజు పాదాలకు లేపనంలా పూసుకోవాలి.

పంటినొప్పి, చిగుళ్ల వాపు: రెండు కప్పుల నీళ్లు తీసుకుని మరిగించాక, రెండు పెద్ద చెంచాల మామిడి పూతను జత చేసి మరికొంత సేపు మరగనిచ్చి, దింపేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిట పట్టాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేయొచ్చు.

కడుపులో పురుగులు: మామిడి టెంకలోని జీడిని వేరు చేసి తడి పోయేవరకు ఆరబెట్టాలి. పెద్ద చెంచాడు మెంతులను కలిపి మెత్తగా చేసి, ఒక సీసాలో భద్రపరచుకోవాలి. కొన్నిరోజుల పాటు మజ్జిగతో కలిపి తీసుకోవాలి.

ఆర్శమొలలు: మామిడి జీడిని వేరు చేసి, ఎండబెట్టి, పొడి చేయాలి. పెరుగు మీది తేటకు ఈ పొడి జత చేసి తీసుకోవాలి.

జ్వరం: మామిడి వేర్లకు కొద్దిగా నీళ్లు జతచేసి మెత్తగా రుబ్బాలి. ఈ ముద్దను అరికాళ్లకు, అరిచేతులకు రాసుకుంటే జ్వరంలో కనిపించే వేడి తగ్గుతుంది.

బట్టతల: ఒక జాడీలో కొబ్బరి నూనె గాని, నువ్వుల నూనె గాని తీసుకుని మామిడికాయలను సంవత్సరం పాటు ఊరబెట్టాలి. ఆ తరవాత ఈ నూనెను తల నూనెగా వాడుకోవాలి.

చెవి నొప్పి: స్వచ్ఛమైన మామిడి ఆకుల నుంచి రసం తీసి కొద్దిగా వేడి చేసి, నొప్పిగా ఉన్న చెవిలో డ్రాప్స్‌గా వేసుకోవాలి.

ముక్కు నుంచి రక్త స్రావం: మామిడి జీడి నుంచి రసం తీసి రెండు ముక్కు రంధ్రాల్లోనూ డ్రాప్స్‌గా వేసుకోవాలి.

కంటి నొప్పి: పచ్చి మామిడి కాయను కచ్చాపచ్చాగా దంచి నిప్పుల పైన సుఖోష్టంగా ఉండేలా వేడి చేసి మూసి ఉంచిన కన్ను పైన బట్ట వేసుకోవాలి.

దంత సంబంధ సమస్యలు: మామిడి ఆకులను ఎండబెట్టి, బూడిద అయ్యేంతవరకూ మండించాలి. దీనికి ఉప్పు కలిపి టూత్‌పౌడర్‌లా వాడుకోవాలి. ఈ పొడికి ఆవనూనెను కలిపి వాడుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

కాలిన గాయాలు: మామిడి ఆకుల బూడిదను డస్టింగ్‌ పౌడర్‌లా వాడితే గాయాలు త్వరగా నయమవుతాయి.

వడ దెబ్బ: పచ్చి మామిడి కాయను నిప్పుల మీద వేడి చేసి పిండితే సులభంగా గుజ్జు వస్తుంది. దీనికి కొద్దిగా చన్నీళ్లను, పంచదారను చేర్చి తాగితే, దప్పిక తీరడమే కాకుండా, శక్తి వస్తుంది.

చెమట కాయలు: రెండు పచ్చి మామిడి కాయలను గిన్నెలో నీళ్లు పోసి ఉడికించి, చల్లార్చాక, గుజ్జు తీసి∙పంచదార, ఉప్పు కలిపి సేవించాలి. దీని వల్ల శరీరంలో వేడి తగ్గి ఒళ్లు పేలకుండా ఉంటుంది.

మధుమేహం: లేత మామిడి ఆకులను, వేప చిగుళ్లను సమాన భాగాలుగా (రెండూ కలిపి అర టీ స్పూను మించరాదు) తీసుకుని మెత్తగా నూరి ముద్ద చేసి, నమిలి మింగేయాలి. ఇలా కొంతకాలం చేస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top