నన్నడగొద్దు ప్లీజ్‌ | love problems and solutions | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Jul 27 2017 12:04 AM | Updated on Apr 7 2019 4:36 PM

నన్నడగొద్దు ప్లీజ్‌ - Sakshi

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ అన్నయ్య! నేను రోజూ మీ లవ్‌ డాక్టర్‌ చదువుతాను.

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్య! నేను రోజూ మీ లవ్‌ డాక్టర్‌ చదువుతాను. నాకు ఒక చిన్న హెల్ప్‌... మా సిస్టర్‌ ఒకరిని లవ్‌ చేస్తోంది. అతన్నే పెళ్లి చేసుకుంటా, లేదంటే చచ్చిపోతా అంటోంది. వాడేమో అమెజాన్‌లో డెలివరీ బాయ్‌. మా ఇంట్లో చెబితే ఒప్పుకోరు. వాడికి ఫ్యామిలీ ఏమీ లేదు సింగిల్‌. ఈ టైమ్‌లో మా పేరెంట్స్‌ మా అక్కకు సంబంధాలు చూస్తున్నారు. ఇంకా నలుగురు సిస్టర్స్‌ ఉన్నారు. అన్నయ్యా ఏం చేయమంటారు చెప్పండి. మా సిస్టర్‌ కూడా రోజూ లవ్‌ డాక్టర్‌ చదువుతుంది. – మహీపాల్‌
చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లు చిన్నవాళ్లు కాదు. నా కళ్లల్లో్ల గొప్పవాళ్లు!చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లు పెద్ద వాళ్లు కారని రూల్‌ కూడా లేదు!ఎవరు ఏమవుతారనేది దేవుడు నిర్ణయిస్తాడు. కష్టపడి పని చెయ్యడం గ్రేట్‌! అమెజాన్‌లో డెలివరీ పని అంటే చాలా కష్టమయిన పని! ఏ పని చెయ్యకుండా ఉంటే మన చెల్లెలిని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఆలోచించాలి! గొప్ప ఉద్యోగాలు చేసేవాళ్లు పెంట పనులు చెయ్యరనుకుంటున్నావా? ఎంచుకోవడానికి చిన్న, గొప్ప కాదన్నా.. మంచి చెడు చూడాలి! ఆల్‌ ది బెస్ట్‌! ‘సార్‌... చంపేశారు సార్‌! యూ ఆర్‌ మాస్‌... మ..మ..మ..మాస్స్‌!!’
 - ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.  లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement