మేడ మీద లవ్‌ జర్నీ! | Love Journey on the Upgrade! | Sakshi
Sakshi News home page

మేడ మీద లవ్‌ జర్నీ!

May 6 2017 11:07 PM | Updated on Sep 5 2017 10:34 AM

మేడ మీద లవ్‌ జర్నీ!

మేడ మీద లవ్‌ జర్నీ!

‘అల్లరి’ నరేశ్‌ హీరోగా శ్రీమతి నీలిమ సమర్పణలో జాహ్నవి ఫిలిమ్స్‌ పతాకంపై అనీష్‌ కృష్ణ దర్శకత్వం

ఆన్‌ లొకేషన్‌

మేడ మీదకి చదువుకోవడానికో లేక చల్లగాలికో వెళుతుంటారు. అయితే అల్లరోడిలా మంచి వయసులో ఉన్న కుర్రోళ్లు మాత్రం మేడ మీదకు వెళ్లారంటే... అదే పనిగా అక్కడే ఉన్నారంటే కారణం వేరే ఉంటుంది. అదేంటో గ్రహించే ఉంటారు. ‘పిల్ల గాలి’ కోసం అన్నమాట. అల్లరోడు ఆ పిల్లని ఫస్ట్‌ ఫస్ట్‌ ఎక్కడ చూశాడు? మేడ మీద మకాం వేసిన అల్లరోడి లైఫ్‌ యాంబిషన్‌ ఏంటి? మనోడి మేడ మీద లవ్‌ జర్నీ ఎలా సాగింది? ఈ ప్రశ్నలకు సమాధానం ‘మేడ మీద అబ్బాయి’.

‘అల్లరి’ నరేశ్‌ హీరోగా శ్రీమతి నీలిమ సమర్పణలో జాహ్నవి ఫిలిమ్స్‌ పతాకంపై అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నటుడు కృష్ణభగవాన్‌ కథ–మాటలు అందించారు. డీజే వసంత్‌ స్వరకర్త. ఇటీవల పొలాచ్చిలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement