ప్రేమ కేవలం మన మనసుకి సంబంధించిన విషయం. కాని పెళ్లి అలా కాదు...భర్త, అత్తమామలు, కొత్త బంధువులు, కొత్త వాతావరణం...ఇలా అన్నీ ఉంటాయి. ప్రేమించుకునే సమయంలో అబ్బాయిలోని గొప్పతనం, మంచితనం మాత్రమే మీకు తెలుస్తాయి. కానీ మనిషన్నాక మంచీ, చెడూ రెండూ ఉంటాయి. పెళ్లి తర్వాతగానీ అబ్బాయి దినచర్య, అలవాట్లు, భావోద్వేగాలు మీకు తెలియవు. కేవలం చిన్న చిన్న కారణాలతో ప్రేమపెళ్లిళ్లు విఫలమవుతున్న సందర్భాలు చూస్తున్నాం మనం. ప్రేమపెళ్లికి ముందు, తర్వాత అమ్మాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్నింటిని అర్థం చేసుకోవాలి. ఇంకొన్నిటికి సర్దుకుపోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది మీ జీవితంపట్ల మీకు అంకితభావం ఉండాలి. కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు పాటిస్తే చాలా సమస్యల నుంచి బయటపడినవారవుతారు.
{పేమ రెండేళ్లదయినా, నాలుగేళ్లదయినా పెళ్లికి సిద్ధపడుతున్నప్పుడు పెళ్లి తర్వాత మీ దినచర్య మొదలు సమాజంలో మీకున్న గుర్తింపు వరకూ అన్నింటి గురించి ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి.
మీరు పెళ్లిచేసుకోబోయే వ్యక్తి పేదవాడయితే పెళ్లి తర్వాత అతనితో కలిసున్నప్పుడు వచ్చే కష్టాలపై అవగాహన పెంచుకోవాలి. కారుని విడిచి బస్సులో వెళితే ఎలా ఉంటుందో ఒకసారి ప్రయత్నించి చూడడంలో తప్పులేదు.
‘పెళ్లయ్యాక భర్త స్వభావాన్ని మార్చుకోవచ్చు’ అని అనుకునే అమ్మాయిలు చాలామంది ఉంటారు. స్వభావరీత్యా భర్తని భార్య, భార్యను భర్త మార్చడం మాటల వరకే తప్ప నిజజీవితంలో అయ్యేపని కాదు.
ఏవో చిన్న చిన్న అలవాట్లు, ఆలోచనలు మార్చగలరేమో కాని మీరు కోరుకున్నట్లు ఎదుటివారు మారిపోరు. ఇలాంటి అపోహలవల్ల కూడా చాలా ప్రేమపెళ్లిళ్లు విఫలమవుతుంటాయి. కేవలం భర్తను మార్చాలనుకునే పనిలో చాలా మంది మహిళలు తమ అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు.
పెళ్లయి, పిల్లలు పుట్టాక మోసపోయానంటూ వచ్చే అమ్మాయిలుంటారు. పెళ్లి తర్వాత కనీసం ఒకటి రెండు సంవత్సరాల తర్వాత పిల్లల్ని కనడం మంచిది. ఆ సమయంలోగా మీ జీవితభాగస్వామి గురించి ఎంతో కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది.
- డాక్టర్ పద్మ పాల్వాయ్, సైకాలజిస్టు,
రెయిన్‌బో చిల్డ్రన్ అండ్ ఉమెన్ హాస్పటల్
ప్రేమ వేరు.. పెళ్లి వేరు...
Published Tue, Feb 18 2014 11:39 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్‌తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement