జనవరిలో కట్టె గానుగతో నూనెల ఉత్పత్తిపై శిక్షణ

 Khader vali speech On dec 30 small grains in Hyderabad - Sakshi

సహజ సాగు పద్ధతిలో పండించిన నూనె గింజలతో కట్టె గానుగ ద్వారా వంట నూనెలను నాణ్యతా ప్రమాణాలతో కూడిన పద్ధతుల్లో ఉత్పత్తి చేయడంపై యువతీ యువకులకు న్యూ లైఫ్‌ ఫౌండేషన్‌(హైదరాబాద్‌) శిక్షణ ఇవ్వనుంది. 18 ఏళ్లు నిండిన కనీసం పదో తరగతి చదివిన వారు అర్హులని, హైదరాబాద్‌ ఎ.ఎస్‌ రావు నగర్‌లో 2019 జనవరి 18వ తేదీ నుంచి 7 రోజుల పాటు శిక్షణ ఉంటుందని ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు శివశంకర్‌ షిండే తెలిపారు. ఆసక్తిగలవారు తమ వివరాలను ఈనెల 31లోగా 81210 08002, 70133 09949 నంబర్లకు ఎస్‌.ఎం.ఎస్‌. లేదా వాట్సాప్‌ ద్వారా సమాచారం పంపవలసిందిగా సూచించారు.

జనవరి 18–20 తేదీల్లో సేంద్రియ, చిరుధాన్యాల ప్రదర్శన
సేంద్రియ వ్యవసాయోత్పత్తులు, చిరుధాన్యాలపై కర్ణాటక ప్రభుత్వ వ్యవసాయ శాఖలో సేంద్రియ విభాగం ఆధ్వర్యంలో 2019 జనవరి 18–20 తేదీల్లో బెంగళూరులో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన జరగనుంది. పౌష్టికాహారం, సుస్తిర వ్యవసాయం, రైతు ఆదాయ భద్రత, కొత్త మార్కెట్లు, కొత్త తరం మెచ్చే మేలైన ఆహారం అనే అంశాలకు ఈ ప్రదర్శనలో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. సేంద్రియ ఉద్యాన ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగులో మేలైన పద్ధతులు, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ తదితర అంశాలపై చర్చాగోష్టులు కూడా ఏర్పాటవుతున్నాయి. వివరాలకు..
26641152,53  , 90087 48074
https://organics-millets.in/

ప్రకృతి వ్యవసాయ గీత రచనల పోటీ
ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేస్తున్న విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం కేంద్రంగా పనిచేస్తున్న జట్టు ట్రస్టు ప్రకృతి వ్యవసాయ గీతాల పోటీలను నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కవులు, రచయితలు ఈ పోటీలో పాల్గొనవచ్చని ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీ డా. డి. పారినాయుడు తెలిపారు. ప్రథమ బహుమతి రూ. 10 వేలు, ద్వితీయ బహుమతి రూ. 5 వేలు, తృతీయ బహుమతి రూ. 5 వేలతోపాటు అంగీకరించిన మరో 10 రచనలకు రూ. వెయ్యి చొప్పున బహుమతులు ఇస్తారు. కవులు, రచయితలు జనవరి 2019 రెండో తేదీ లోగా 94401 64289, 94940 12244 నంబర్లకు వాట్సప్‌ ద్వారా గాని,  jattutrust1 @gmail.comMకు ఈమెయిల్‌ ద్వారా గాని పంపవచ్చు.

30న హైదరాబాద్‌లో సిరిధాన్యాలపై డా. ఖాదర్‌ ప్రసంగం
సిరిధాన్యాలు, కషాయాలు, కట్టె గానుగ నూనెలు తదితర దేశీ ఆహార పదార్థాలతో ఆధునిక రోగాల నియంత్రణ–నిర్మూలనపై ఈ నెల 30 (ఆదివారం)న సా. 4.30 గం. నుంచి రాత్రి 7 గం. వరకు కూకట్‌పల్లిలోని పి.ఎన్‌.ఎం. హైస్కూల్‌ ఆవరణ (కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయం ఎదురు లైన్‌)లో కృషి రత్న, స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార–ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్‌ వలి ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్‌ అధ్యక్షులు వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 70939 73999, 98493 12627, 96767 97777.
 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top