విలనీగా కరీనా కపూర్? | Kareena Kapoor as vilani? | Sakshi
Sakshi News home page

విలనీగా కరీనా కపూర్?

Sep 12 2015 12:34 AM | Updated on Sep 3 2017 9:12 AM

విలనీగా కరీనా కపూర్?

విలనీగా కరీనా కపూర్?

కథానాయికలు నెగటివ్ పాత్రల్లో కనిపించడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలా మంది గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నెగటివ్ షేడ్స్

గాసిప్
 

కథానాయికలు నెగటివ్ పాత్రల్లో కనిపించడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలా మంది గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడా లిస్ట్‌లో కరీనా కపూర్  చేరనున్నారని సమాచారం. ‘‘హాలీవుడ్ చిత్రం ‘గాళ్ విత్ ద డ్రాగన్ టాటూ’ సినిమాలో లిజ్‌బెత్ శాలెండర్ పోషించిన పాత్ర లాంటి విలనీ పాత్ర చేయాలని ఉంది.

ఇప్పటివరకూ హీరోయిన్ పాత్రలు చేసి బోర్ కొట్టేసింది. ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ఉంది’’ అని తన మనసులో మాటను వెలిబుచ్చారు కరీనా కపూర్. ఓ ప్రముఖ దర్శకుడు ఇప్పటికే ఆమెకు కథ వినిపించారనీ, అందులో కరీనా కపూర్ పాత్రకు  నెగటివ్ టచ్ ఉంటుందని బాలీవుడ్ వర్గాల బోగట్టా.
 
 

Advertisement
 
Advertisement
Advertisement