పాములాంటి సీకటి పడగ దించి పోయింది | Kallu Movie Tellarindi Legando Song | Sakshi
Sakshi News home page

పాములాంటి సీకటి పడగ దించి పోయింది

Feb 11 2019 12:48 AM | Updated on Feb 11 2019 12:48 AM

Kallu Movie Tellarindi Legando Song - Sakshi

భయం లేదు. తెల్లారింది. పాములాంటి చీకటి పడగ దించింది, చావు లాంటి రాత్రి చూరు దాటింది, ముడుచుకున్న పిట్ట కూడా చెట్టును విడిచింది. లెగండి. మంచాలు దిగండి. చమటే చమురుగా సూర్యుడినే వెలిగించాలి, అగ్గిపూలు పూయించాలి. లేవండి. ‘పద్మశ్రీ’ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసి, స్వయంగా పాడిన ఈ పాట ‘కళ్లు’ చిత్రంలోనిది. సంగీతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 1988లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ ఎం.వి. రఘు. శివాజీరాజా, భిక్షు, ‘కళ్లు’ చిదంబరం నటించారు.

తెల్లారింది లెగండోయ్‌ కొక్కురోక్కో
మంచాలింక దిగండోయ్‌ కొక్కురోక్కో
పాములాంటి సీకటి పడగ దించి పోయింది
భయం నేదు భయం నేదు నిదర ముసుగు తీయండి
సావు లాటి రాతిరి సూరు దాటి పోయింది
భయం నేదు భయం నేదు సాపలు సుట్టేయండి
ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట సెట్టు ఇడిసింది
మూసుకున్న రెప్పలిడిసి సూపు లెగరనీయండి                                      

సురుకు తగ్గిపోయింది సెందురుడి కంటికి
చులకనై పోయింది లోకం సీకటికి
కునుకు వచ్చి తూగింది సల్లబడ్డ దీపం
ఎనక రెచ్చి పోయింది అల్లుకున్న పాపం
మసకబారి పోయిందా సూసే కన్ను
ముసురుకోదా మైకం మన్నూ మిన్ను
కాలం కట్టిన గంతలు దీసి కాంతుల ఎల్లువ గంతులు ఏసి
                                     
ఎక్కిరించు రేయిని సూసి ఎర్రబడ్డ ఆకాశం
ఎక్కుబెట్టి యిసిరిందా సూరీడి సూపుల బాణం
కాలి బూడిదైపోదా కమ్ముకున్న నీడ
ఊపిరితొ నిలబడుతుందా సిక్కని పాపాల పీడ
సెమట బొట్టు సమురుగా సూరీణ్ణి ఎలిగిద్దాం
ఎలుగు సెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం
ఏకువ శక్తుల కత్తులు దూసి రేతిరి మత్తును ముక్కలు సేసి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement