సిరివెన్నెల సీతారామశాస్త్రికి వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Pays Tribute To Sirivennela Seetharama Sastry | Sakshi
Sakshi News home page

సిరివెన్నెల సీతారామశాస్త్రికి వైఎస్‌ జగన్‌ నివాళి

May 20 2026 1:24 PM | Updated on May 20 2026 1:32 PM

YS Jagan Pays Tribute To Sirivennela Seetharama Sastry

సాక్షి, తాడేపల్లి: నేడు సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. సీతారామశాస్త్రికి నివాళి అర్పించారు. వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా..‘తెలుగు సాహిత్య సరస్వతీ పీఠంపై అక్షరార్చన చేసిన మహాకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి. సమాజానికి సందేశం ఇచ్చేలా, యువతకు స్ఫూర్తినిచ్చేలా, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఆయన రాసిన పాటలు కోట్లాది తెలుగు ప్రజల హృద‌యాల్లో గూడుక‌ట్టుకుని ఉన్నాయి. ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement