ఉద్యోగాలు దొరక్క పెళ్లిళ్ల వాయిదా.. | Iran Annual Population Growth Down Yearly | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ సమస్య

Jun 19 2020 7:46 AM | Updated on Jun 19 2020 7:46 AM

Iran Annual Population Growth Down Yearly - Sakshi

అబ్బాయిలు ఉద్యోగాలు దొరక్క పెళ్లి, పిల్లలు వద్దనుకుంటున్నారు. అమ్మాయిలు కెరీర్‌లో పైపైకి ఎదగడానికి పెళ్లిళ్లను వాయిదా వేస్తున్నారు. ఇరాన్‌లో ప్రస్తుత పరిస్థితి ఇది! ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఇరాన్‌ ఎంత న్యూక్లియర్‌ పవర్‌ అయినా, 2050 నాటికి మూడింట ఒక వంతు జనాభా 60 ఏళ్లు పైబడిన వారే అయి ఉండి, ప్రపంచదేశాల దృష్టిలో వృద్ధ దేశంగా మిగిలిపోతుందని ఆ దేశ పాలకులు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్‌ వార్షిక జనాభాలో పెరుగుదల ఒక శాతం కన్నా తక్కువకు పడిపోయింది!

ఈ అత్యల్ప స్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో వేసక్టమీలను నిషేధిస్తూ ఇరాన్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఆసుపత్రులు అందించే కుటుంబ నియంత్రణ సదుపాయాలపైన కూడా ఆంక్షలు విధించింది. 2020 జూన్‌ 15 నాటికి ఇరాన్‌ జనాభా 9 కోట్ల 40 లక్షలు. అబ్బాయిలు ఏదో ఒక ఉద్యోగంలే అని సర్దుకుపోవాలి. లేదా అమ్మాయిలు ఎవరో ఒకరులే అని సర్దుకుపోవాలి. ఇరాన్‌  కోరుకుంటున్నట్లు జనాభా పెరగడానికి ఇది కూడా ఒక మార్గం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement