ప్రేమంటే... పందెమా? | Hollywood romantic comedy | Sakshi
Sakshi News home page

ప్రేమంటే... పందెమా?

Jul 20 2016 11:32 PM | Updated on Sep 4 2017 5:29 AM

ప్రేమంటే... పందెమా?

ప్రేమంటే... పందెమా?

‘ప్రేమలో పడటానికి ఓ టైమ్ ఉన్నట్లే - అందులో నుంచి బయటపడటానికి ఓ టైమ్ ఉంటుంది. అది మళ్లీ మళ్లీ దొరకదు’ అంటాడు హీరో రామ్‌చరణ్...

హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - హౌ టు లూజ్ ఏ గై ఇన్ టెన్ డేస్
 

‘ప్రేమలో పడటానికి ఓ టైమ్ ఉన్నట్లే - అందులో నుంచి బయటపడటానికి ఓ టైమ్ ఉంటుంది. అది మళ్లీ మళ్లీ దొరకదు’ అంటాడు హీరో రామ్‌చరణ్... నేను రాసిన ‘ఆరెంజ్’ సినిమాలో. ఇవ్వాళా రేపూ ప్రేమలో పడటం ఎంత సులభంగా, వేగంగా జరిగిపోతుందో - విడిపోవటం కూడా అంత ఫాస్ట్‌గా జరిగిపోతుంది. విదేశాల్లో మరీనూ. ఓ అబ్బాయిని 10 రోజుల్లోనే ప్రేమలో పడేసి, అతనితో విడిపోతానని అమ్మాయి చాలెంజ్ చేస్తుంది. కాని నిజమైన ప్రేమలో నుంచి అంత త్వరగా బయటికి రాగలమా?
   
హాలీవుడ్‌లో కథలు వండరు, రాస్తారు - వెదుకుతారు. అన్నింటినీ మించి నిజ జీవిత చరిత్రల నుంచి, వాస్తవ సంఘటనల నుంచి, కథల నుంచి, నవలల నుంచి సినిమాకి అవసరమైన సబ్జెక్ట్‌లు అన్వేషిస్తుంటారు.అలా ఓ కార్టూన్ బుక్‌లో నుంచి పుట్టిన కథే ‘హౌ టు లూజ్ ఏ గై ఇన్ టెన్ డేస్’. మైఖేల్ అలెగ్జాండర్, జెన్నీలాంగ్ రాసిన ఓ కార్టూన్ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
 ఆండీ ఆండర్సన్ ఓ మహిళా పత్రికలో కాలమిస్ట్‌గా పనిచేస్తుంటుంది. ఆడవాళ్లకి ఉపయోగపడే అంద చందాల చిట్కాలు, వంటల వివరాలు రాసి రాసి విసుగు వస్తుంది. మతం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు... ఇలాంటి విషయాల మీద ఆర్టికల్స్ రాయాలని ఆండీ ఉబలాటం, ఉత్సాహం. అనుకోకుండా ఆండీ స్నేహితురాలు మిబిల్లా తన బోయ్‌ఫ్రెండ్‌తో విడిపోతుంది. బ్రేకప్ అనేది నిజానికి మనసుకి బాధ కలిగించే విషయం. అలాంటిది ఇంత రొటీన్ అయిపోయిందేంటా అనే బాధతో, ఆలోచనతో ఆండీ, ‘హౌ టు లూజ్ ఏ గై ఇన్ టెన్ డేస్’.

‘పది రోజుల్లో ప్రేమికుణ్ని వదిలించుకోవడం ఎలా?’ అనే ఆర్టికల్ రాయాలని అనుకుంటుంది. ఒక అబ్బాయిని ప్రేమలో పడేసి, వాడిచేత పొరబాట్లు చేయించి, కేవలం పది అంటే పది రోజుల్లో - ఆ ప్రేమకి, అతనికి గుడ్‌బై చెప్పాలి. ఆ అనుభవాలతో తను చేసే పత్రికకి ఇదే టైటిల్‌తో మంచి ఆర్టికల్ రాయాలి.ఓ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలో పనిచేసే బెంజిమిన్ బారీకి తనని చూస్తే ఏ అమ్మాయి అయినా ఇట్టే పడిపోతుందని ధీమా. పది రోజుల్లో ఓ అమ్మాయిని పడేస్తానని చాలెంజ్ చేస్తాడు. అది కాని జరిగితే - వజ్రాల ప్రకటనలు అతనికే అప్పగిస్తుంది యాడ్ ఏజెన్సీ. అదీ పందెం. ఆండీ, బెంజిమిన్ - తమ అసలు ఉద్దేశాలు బయటపడనివ్వకుండా, ప్రేమలో పడతారు (నటిస్తారు). ఆ తర్వాత వారి ప్రేమ నాటకం ఎలా సాగింది, వాళ్లు పనిచేసే కంపెనీలపై ఈ ప్రేమ పర్యవసానం ఎలాంటి ప్రభావం చూపించిది అనేది దర్శకుడు డొనాల్డ్ పెట్రే చిత్రీకరించాడు. కేట్ హడ్సన్, మాథ్యూ, మెక్ కొనాగ్ జంటగా నటించారు.ఇందులోని హీరోయిన్ వాడిన టెక్నిక్స్‌ని అమ్మాయిలు ఇప్పటికీ ఫాలో అవుతుండటం విశేషం. 50 మిలియన్ల డాలర్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా 175 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది.
 - తోట ప్రసాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement