స్లీ ఈఈఈఈఈఈ వ్‌! | heroines new fashion dresess | Sakshi
Sakshi News home page

స్లీ ఈఈఈఈఈఈ వ్‌!

Apr 6 2017 11:24 PM | Updated on Sep 5 2017 8:07 AM

పొడవు చేతులండీ... బహు పొడవు చేతులండీ! తన పాదాలను తనే నమస్కరించుకునే పొడవు చేతులండీ!

పొడవు చేతులండీ... బహు పొడవు చేతులండీ! తన పాదాలను తనే నమస్కరించుకునే పొడవు చేతులండీ! స్టైల్‌ కొత్తదండీ లాంగ్‌ లివ్‌ అండీ!!

భుజాల మీదుగా దుపట్టాను కప్పుకున్న విధంగా రూపుకడుతుందీ స్టైల్‌. లాంగ్‌ స్లీవ్స్‌ డిజైన్‌తో ఆకట్టుకుంటున్న కేప్‌ డిజైన్‌ ఇది.

పొడవులో లెహంగాతో పోటీపడుతున్న లాంగ్‌ స్లీవ్స్‌ ఇప్పుడు అతివల అందానికి కొత్త సొబగులు అద్దుతాయి.

రాచ కళ ఉట్టిపడేలా, మత్స్య సుందరిని తలపించే రెడ్‌కార్పెట్‌ డ్రెస్‌ ఇది. లాంగ్‌ వెస్ట్రన్‌ గౌన్‌కి పొడవాటి స్లీవ్స్‌ ప్రధాన ఆకర్షణ.

తెల్ల కలువకు బంగారురేకులు తాపడం చేసినట్లుందీ లాంగ్‌ స్లీవ్స్‌ బ్లవుజ్‌. సంప్రదాయ వేడుక... మోడరన్‌ ఫంక్షన్‌... దేనికైనా స్పెషల్‌ అట్రాక్షన్‌ ఇది.

లాంగ్‌ అనార్కలీ గౌన్‌కి దుపట్టాలా అమరిన లాంగ్‌ స్లీవ్స్‌ ఈ డ్రెస్‌ను మరింత స్టైలిష్‌గా మార్చేసింది. ఈవెనెంగ్‌ వెస్ట్రన్‌ వేడుకలకు ప్రధాన ఆకర్షణను తెచ్చిపెడుతుంది.

వెస్ట్రన్‌ లాంగ్‌ గౌన్‌కి చీలికలుగా ఉండే లాంగ్‌ స్లీవ్స్‌ చూపులను కట్టడి చేస్తుంది.

పలాజో ప్యాంట్‌ మీదకు లాంగ్‌ స్లీవ్స్‌ డిజైనర్‌ కేప్‌! వెస్ట్రన్‌ వేడుకలో స్టైలిష్‌గా వెలిగిపోయే డ్రెస్‌.

Advertisement
 
Advertisement
Advertisement