గజగుచ్ఛం | Gaja whorl | Sakshi
Sakshi News home page

గజగుచ్ఛం

Feb 24 2016 10:32 PM | Updated on Sep 3 2017 6:20 PM

గజగుచ్ఛం

గజగుచ్ఛం

ఫొటో చూసి ఇందులో గజం లేదని అవాక్కవుతున్నారా..?

తిక్క  లెక్క

ఫొటో చూసి ఇందులో గజం లేదని అవాక్కవుతున్నారా..? ఇందులో గజం మిథ్య కాదు, విశేషణం మాత్రమే! భారీ స్థాయి సన్మానాల్లో ఉపయోగించే గజమాలలు ఎలాంటివో ఈ గజగుచ్ఛం కూడా అలాంటిదే. అయితే, ఎవరి సన్మానానికో, సత్కారానికో దీనిని రూపొందించలేదు. కేవలం రికార్డు కోసం రూపొందించారు.

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు చెందిన నార్ద్‌వెస్ట్ జెంత్రం షాపింగ్ మాల్ ఈ గజగుచ్ఛాన్ని రూపొందించి, ప్రదర్శనకు పెట్టింది. దీని తయారీకి ఏకంగా 1,56,940 గులాబీలను ఉపయోగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పగుచ్ఛంగా ఇది గిన్నెస్ రికార్డు బద్దలుకొట్టింది.
 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement