యన్వీ మానండి స్లిమ్ అవండి!

‘న్యూ’స్
స్థూలకాయులకు శాకాహారమే మేలని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. మాంసాహారం అలవాటు ఉన్న స్థూలకాయులు శాకాహారానికి మళ్లినట్లయితే, వారికి టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అమెరికాలోని ఫిజీషియన్స్ కమిటీ ఫర్ రెస్పాన్సిబుల్ మెడిసిన్‌కు చెందిన నిపుణులు జరిపిన తాజా పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. మాంసాహారానికి అలవాటుపడిన స్థూలకాయులు పూర్తిగా శాకాహారానికి మళ్లిన కొద్దికాలంలోనే బరువు తగ్గడాన్ని గుర్తించామని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఫిజీషియన్స్ కమిటీ ఫర్ రెస్పాన్సిబుల్ మెడిసిన్ నిపుణురాలు డాక్టర్ హానా కహ్లోవా తెలిపారు.
టైప్–2 డయాబెటిస్ వల్ల పెద్దగా ముప్పు ఉండదని చాలామంది అపోహపడుతుంటారని, ఈ వ్యాధి సైలెంట్ కిల్లర్‌లాంటిదని డాక్టర్ కహ్లోవా చెబుతున్నారు. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న వారు మాంసాహారాన్ని మానేసి శాకాహారానికి మళ్లినట్లయితే టైప్–2 డయాబెటిస్ ముప్పును తప్పించుకోవచ్చని ఆమె అంటున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి