భద్రత కోసం బీసేఫ్... | for the safety of bsafe | Sakshi
Sakshi News home page

భద్రత కోసం బీసేఫ్...

May 15 2014 12:34 AM | Updated on Nov 6 2018 5:26 PM

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మనకు తెలుసు.

భలే ఆప్స్...
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మనకు తెలుసు. ఇష్టమైన వారి క్షేమ సమాచారాలు ఫోన్ ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా తెలుసుకునేందుకు వీలు కల్పించే అప్లికేషన్ బీసేఫ్. ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన ఈ సెక్యూరిటీ అప్లికేషన్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఎప్పుడు ఎక్కడున్నారు? అన్న విషయాన్ని తెలుపుతుంది. పిల్లలు ఏదైనా కొత్త కాంటాక్ట్‌ను స్టోర్ చేసుకున్న వెంటనే ఆ విషయం తల్లిదండ్రులకు తెలియజేస్తుంది.  ఫాలోమీ అన్న ఫీచర్ ద్వారా మీరు ఉన్న ప్రాంతాన్ని మీ కాంటాక్ట్స్‌లోని వ్యక్తులు కూడా తెలుసుకునేలా ఏర్పాట్లు చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మీ కాంటాక్ట్స్‌లోని వారికి ఎస్‌ఎంఎస్ పంపుకోవచ్చు. ఎవరైనా ఒక్కరికి ఎస్‌ఎంఎస్ తోపాటు ఫోన్‌కాల్  అందేలా చేయవచ్చు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్ ఆడియో, వీడియో రికార్డింగ్ కూడా ఆటోమేటిక్‌గా చేపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement