ప్రొబయోటిక్స్‌తో ఆ వ్యాధులకు చెక్‌

Elderly People Should Take Probiotics To Preserve Their Bones - Sakshi

లండన్‌ : ప్రొబయోటిక్స్‌తో పెద్దల్లో ఎముకల పటుత్వం పెరుగుతుందని, వీటి వాడకంతో ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయని పరిశోధకులు వెల్లడించారు. మంచి బ్యాక్టీరియాతో కూడిన సప్లిమెంట్స్‌ శరీరానికి మేలు చేస్తాయని స్వీడన్‌ పరిశోధకులు చేపట్టిన తాజా అథ్యయనం తెలిపింది. ముఖ్యంగా వృద్ధుల్లో ప్రొబయోటిక్స్‌ వాడకంతో ఎముకలు దెబ్బతినకుండా కాపాడవచ్చని గుర్తించారు.

 పెద్దల్లో ఎముకలు విరిగే పరిస్థితిని నివారించే చికిత్సలో నూతన మైలరాయిగా తాజా అథ్యయనంలో వెల్లడైన అంశాలు ఉపకరిస్తాయని సర్వే చేపట్టిన యూనివర్సిటీ ఆఫ్‌ గొతెన్‌బర్గ్‌ పరిశోధకులు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిలో ఎముకలను బలహీనపరిచే ఓసియోసొరోసిస్‌ వ్యాధి బారిన పడుతున్న క్రమంలో తాజా అథ్యయనం వెలువడింది. ప్రొబయోటిక్స్‌తో చికిత్స ద్వారా రానున్న రోజుల్లో ఈ తరహా వ్యాధులను నియంత్రించవచ్చని పరిశోధకులు వెల్లడించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top