
వీళ్లైదుగురూ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఉన్నారు. భర్తలు టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే తోడుగా ఉండేందుకు వచ్చారు. ఇండియా–దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్ నిన్నటితో ముగిసింది. ఆ తర్వాత జనవరి 13 నుంచి సెంచ్యూరియన్‌లో రెండో మ్యాచ్ మొదలౌతుంది. అయితే రెండో మ్యాచ్‌కు కూడా వీళ్లను భర్తలతో ఉండేందుకు అనుమతిస్తారా అన్నది చివరి నిమిషం వరకు తేలలేదు! ఇంకొకటి కూడా తేలలేదు... దక్షిణాఫ్రికాలో భారతీయ క్రికెటర్ల భార్యల బాగోగులు ఎవరు చూడాలన్నది. వీళ్లకు సంరక్షణగా మయాంక్ పారిఖ్ అనే ఆయన్ని పంపాలని తొలి మ్యాచ్‌కు రెండు రోజుల ముందు ముంబైలో జరిగిన బీసీసీఐ సమావేశంలో అనుకున్నారు. ‘‘అబ్బెబ్బే.. ఎందుకు?!
ఆల్రెడీ అక్కడ రిషికేశ్ ఉపాధ్యాయ అనే ఆయన ఉన్నాడు కదా’ అని అందులోనే కొందరు అన్నారు. చివరికి ఈయనా వెళ్లలేదు. అక్కడున్న ఆయనకూ విషయం తెలీదు. ఇలా ఉంటారు మనవాళ్లు! భార్యను వెనక వదిలేసి, ముందు నడుస్తుంటారు కొంతమంది భర్తలు. అలా, బీసీసీఐ క్రికెటర్‌లకు సెక్యూరిటీ ఇచ్చి, ‘వారి భార్యలకు సెక్యూరిటీ అవసరమా..’ అన్నట్లు వెనకా ముందూ ఆలోచిస్తోంది.