చిన్న మార్పుతో.. ఇల్లంతా వెలుగుల వెన్నెలే..!

Diwali Lights Decoration With Imitation Jewellery - Sakshi

ఇమిటేషన్ జువెలరీ, ఫ్యాషన్ జువెలరీ ఇక ధరించడానికి వీలు లేకుండా ఉన్నా, వాడి వాడి బోర్ కొట్టేసినా వాటిని ఏం చేస్తున్నారు? పండగ వేళకు ఇదిగో ఇలా మార్చేయండి. ఇంటికి, కంటికి కళ పెరుగుతుంది.

ఎన్నో దీపాలతో అలంకరించే వెలుగుల దీపావళి ఇంకా అందంగా మెరవాలంటే.. దీపాలు పెట్టే అడుగు భాగం మీ పాత ఇమిటేషన్(గిల్టు) ఆభరణాలతో తీర్చిదిద్దండి. కొత్త కాంతితో మెరిసిపోతూ కనులకు విందు చేస్తాయి.

రకరకాల రంగు పూసలు ఎన్నో ఉంటాయి. వాటిని కలిపి దండలా గుచ్చి గుమ్మానికి వేలాడదీస్తే! ఇలా అందంగా ఉంటుంది. లేదంటే ప్లెయిన్‌గా ఉండే గోడకు హ్యాంగ్ చేస్తే చాలు.

ప్లెయిన్ చార్ట్ తీసుకొని పెద్ద చమ్కీలు, పూసలు, ముత్యాలు, కుందన్స్‌ను అతికించి వేలాడదీస్తే.. వాల్ హ్యాంగింగ్ ఎంత చూడముచ్చటగా ఉంటుందో కదా!

పాతవైన ఎంబ్రాయిడరీ డ్రెస్సులు, చీరలు, లెహంగాలకు అందమైన డిజైన్స్ ఉంటాయి. వాటిని అలాగే పడేయకుండా జాగ్రత్తగా కట్ చేసి,  పూలతో కలిపి రంగవల్లులను దిద్దితే.. పండగ కళ రెట్టింపు అవకుండా ఉండదు.

ఇలాంటి ఎన్నో ఐడియాలను మీరూ చేయగలరు. ప్రయత్నించండి. పండగ ఆనందాన్ని వెయ్యింతలు చేయండి.

Read latest Festival News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top