సల్మాన్‌కి దీపూ నో చెప్పిందా?! | dipika told to don't act to Salman ? | Sakshi
Sakshi News home page

సల్మాన్‌కి దీపూ నో చెప్పిందా?!

May 17 2015 12:25 AM | Updated on Sep 3 2017 2:10 AM

సల్మాన్‌కి దీపూ  నో చెప్పిందా?!

సల్మాన్‌కి దీపూ నో చెప్పిందా?!

సల్మాన్‌తో సినిమా అంటే దాని రేంజే వేరుగా ఉంటుంది.

గాసిప్
 
సల్మాన్‌తో సినిమా అంటే దాని రేంజే వేరుగా ఉంటుంది. బడ్జెట్ కోట్లలో ఉంటుంది. బాక్సాఫీసు రికార్డుల్ని బద్దలు కొట్టే అవకాశమూ మెండుగా ఉంటుంది. అందుకే హీరోయిన్లు సల్లూ పక్కన చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటిది దీపికా పదుకొనె సల్మాన్ పక్కన చేయడానికి నో చెప్పిందంటే ఆశ్చర్యం వేయదూ? అలాగే ఆశ్చర్యపోయారంతా. సుల్తాన్, శుద్ధి చిత్రాల్లో సల్మాన్ సరసన దీపిక నటిస్తోందన్న వార్తలు మొదట గుప్పుమన్నాయి. తర్వాత ఆమె నో చెప్పిందన్న వార్తలూ భగ్గుమన్నాయి.

నిజానికి ఆ రెండు వార్తలూ తప్పేనట. అసలు దీపిక ఆ చిత్రాల్లో నటించడానికి ఒప్పుకున్నదీ లేదట. నో చెప్పిందీ లేదట. ప్రపోజల్స్ అయితే వచ్చాయి కానీ చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉండటంతో కుదరలేదు, అంతమాత్రాన దీన్ని ఇష్యూ చేయాల్సిన పని లేదు అంటూ కుండ బద్దలు కొట్టేసింది దీపూ. మరి ఈ రూమర్లు ఎలా పుట్టాయనేగా? ఫిల్మ్‌ఫేర్ ఫంక్షన్లో ఇద్దరూ కలిసి స్టేజ్‌మీద డ్యాన్స్ చేశారు. అది చూసిన కొందరు ఈ పుకార్లు పుట్టించారన్నమాట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement