దండి 6-4-1930 | Dandy 6-4-1930 | Sakshi
Sakshi News home page

దండి 6-4-1930

Apr 5 2015 11:50 PM | Updated on Sep 2 2017 11:54 PM

దండి  6-4-1930

దండి 6-4-1930

ఉప్పు నిప్పై మండుతోంది. స్వాతంత్య్ర నినాదమై జ్వలిస్తోంది.

ఉప్పు నిప్పై మండుతోంది. స్వాతంత్య్ర నినాదమై జ్వలిస్తోంది. దండి యాత్రలో అణువణువు ఆత్మగౌరవతేజమై వెలుగుతోంది. గుజరాత్‌లోని నవసరి పట్టణానికి సమీపంలోని కోస్తా తీర గ్రామం దండి గాంధీజీ పవిత్ర అడుగుల సవ్వడితో మైమరిచిపోతోంది. 

ఉదయం 6.30... గాంధీజీ తన గుప్పెటతో ఉప్పు గళ్లు తీసుకొని ‘‘ఈ ఉప్పుగళ్లతో బ్రిటీష్ సామ్రాజ్యపు పునాదులు కదిలేలా చేస్తాను’’ అన్నారు. మహాత్ముడి మాటను చరిత్ర నిజం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement