సోషల్ మీడియాతో నిద్రకు చేటు | Damage to sleep with social media | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాతో నిద్రకు చేటు

Jan 30 2016 12:31 AM | Updated on Sep 3 2017 4:34 PM

సోషల్ మీడియాతో నిద్రకు చేటు

సోషల్ మీడియాతో నిద్రకు చేటు

ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల జమానాలో సోషల్ మీడియా వాడుక విపరీతంగా పెరిగింది.

పరిపరి   శోధన

ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల జమానాలో సోషల్ మీడియా వాడుక విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియాకు సద్వినియోగాలు, దుర్వినియోగాల మాట ఎలా ఉన్నా, దీనివల్ల ఆరోగ్యానికి చేటు పొంచి ఉందని అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అదే పనిగా ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్లు వాడేవాళ్లకు రాత్రిపూట సక్రమంగా నిద్రపట్టదని, సోషల్ మీడియా వాడుకను తగ్గించుకోకపోతే దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల ఇతరేతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని పిట్స్‌బర్గ్ వర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement