కెఫీన్‌తో గుండెకు రక్షణ | Care for caffeine | Sakshi
Sakshi News home page

కెఫీన్‌తో గుండెకు రక్షణ

Jun 23 2018 12:06 AM | Updated on Jun 23 2018 12:06 AM

 Care for caffeine - Sakshi

రోజూ కాఫీ తాగితే కొన్ని రోగాల బారిన పడకుండా ఉండవచ్చునని ఇప్పటికే చాలా పరిశోధనలు స్పష్టం చేశాయి. అయితే ఇదెలా జరుగుతుందో మాత్రం ఎవరికీ తెలియలేదు. ఈ లోటును భర్తీ చేశారు జర్మనీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కాఫీలో ఉండే కెఫీన్‌ ప్రభావంతో మన కణాల్లోని మైటోకాండ్రియాలో ఉండే ఒక ప్రొటీన్‌ చురుకుగా కదులుతుందని వీరు గుర్తించారు. ఈ ప్రొటీన్‌ గుండె కణాలకు జరిగే నష్టాన్ని ఎప్పటికప్పుడు నివారిస్తుందని.. ఫలితంగా కాఫీ తాగితే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ అవుతాయని వీరు వివరిస్తున్నారు.

 మామూలు పరిస్థితుల్లో రక్తనాళాల తాలూకూ ఎండోథీలియల్‌ కణాల్లో ఉండే పీ27 కెఫీన్‌ అందినప్పుడు మైటోకాండ్రియలోకి చేరి ఫైబ్రోబ్లాస్ట్‌ల నుంచి కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుందని.. ఈ కణాల్లో కాంట్రాక్టైల్‌ ఫైబర్స్‌ ఉండటం వల్ల గుండెపోటు కారణంగా దెబ్బతిన్న కండరాలను మరమ్మతు చేయడం వీలవుతోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జాచిమ్‌ ఆల్స్‌షామిడ్‌ వివరించారు. ఈ స్థాయి చర్యలు జరగాలంటే నాలుగు కప్పుల కాఫీలో ఉండేంత కెఫీన్‌ శరీరంలోకి చేరాల్సి ఉంటుందని అంటున్నారు. కెఫీన్‌ గుండెజబ్బులతోపాటు మధుమేహం అంచుల్లో ఉన్నవారు, ఊబకాయులకూ మంచిదని ఎలుకలపై జరిగిన ప్రయోగాలు ఇప్పటికే రుజువు చేసిన విషయం తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement