ఇయం వార్తా శ్రూయంతాం | Bullet-proof clothing store is a company in the Netherlands | Sakshi
Sakshi News home page

ఇయం వార్తా శ్రూయంతాం

Feb 3 2015 10:54 PM | Updated on Sep 2 2017 8:44 PM

ఇయం వార్తా శ్రూయంతాం

ఇయం వార్తా శ్రూయంతాం

నెదర్‌లాండ్స్‌లో ఒక కంపెనీ బుల్లెట్-ప్రూఫ్ బట్టల దుకాణాన్ని ప్రారంభించింది.

ప్రపంచం
 
నెదర్‌లాండ్స్‌లో ఒక కంపెనీ బుల్లెట్-ప్రూఫ్ బట్టల దుకాణాన్ని ప్రారంభించింది. ఇందులో బుల్లెట్-ప్రూఫ్ టైతో సహా టీషర్ట్‌ల వరకు అమ్ముతారు. ఇవి నేరస్థుల కోసం మాత్రం కాదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది  అయిదుమంది సహచర సైనికులను కాల్చి వేసిన కేసులో దక్షిణ కొరియా సైనికుడు లిమ్‌కు మిల్ట్రీ కోర్టు మరణశిక్ష విధించింది  క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో తాజా చిత్రాలను క్యూబన్ స్టేట్ మీడియా విడుదల చేసింది. ఆయన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లకు ఈ ఫోటోలు సమాధానం చెబుతాయని అధికారులు చెబుతున్నారు.

బంగ్లాదేశ్‌లో ఒక బస్సుపై జరిగిన పెట్రోల్ బాంబు దాడిలో 15 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు
  ప్రఖ్యాత సింగర్ విట్నీ హస్టన్ కూతురు బాబీ క్రిస్టినా కోమలోకి వెళ్లిపోయారు. ఆమె వయసు 21 సంవత్సరాలు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement