అందమైన అధరాల కోసం... | buety tips for lips | Sakshi
Sakshi News home page

అందమైన అధరాల కోసం...

Jul 17 2016 12:37 AM | Updated on Sep 4 2017 5:01 AM

అందమైన అధరాల కోసం...

అందమైన అధరాల కోసం...

ముఖానికి నవ్వు ఎంత అందాన్నిస్తుందో... పెదవుల నాజూకుదనం ఆ నవ్వుకు మరింత అందాన్నిస్తుంది. కొందరి ముఖం చక్కని ఛాయతో ఉన్నా...

బ్యూటిప్స్
ముఖానికి నవ్వు ఎంత అందాన్నిస్తుందో... పెదవుల నాజూకుదనం ఆ నవ్వుకు మరింత అందాన్నిస్తుంది. కొందరి ముఖం చక్కని ఛాయతో ఉన్నా... పెదవులు మాత్రం నల్లగా ఉంటాయి. కొందరికి వాతావరణాన్ని బట్టి నల్లబడి ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సరి...
కొన్ని గులాబి రేకులను మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిలో కొంచెం తేనె, పాలమీగడ, వెన్న వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు పెదవులను మసాజ్ చేస్తే నలుపు పోతుంది.
గులాబి రేకులను పాలలో వేసి నానబెట్టాలి. తర్వాత పేస్ట్ చేసి తేనె, చిటికెడు కుంకుమపువ్వు కలపాలి. దీన్ని పెదవులకు రాసి, పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.
క్యారెట్ రసాన్ని, బీట్‌రూట్ రసాన్ని సమపాళ్లలో కలిపి దానితో పెదవులపై సున్నితంగా పది నిమిషాల పాటు రుద్దాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రోజుకోసారి ఇలా చేస్తే రెండు వారాల్లో ఫలితం కనిపిస్తుంది.
దానిమ్మగింజల్ని పేస్ట్ చేసి... అందులో కొద్దిగా పాల మీగడ, రోజ్ వాటర్ వేసి కలపాలి. దీనితో పెదవులను బాగా రుద్ది, ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఇలా చేస్తే నలుపు పోయి పెదవులు మంచి రంగులోకి మారతాయి.
చెంచాడు స్ట్రాబెర్రీ జ్యూస్‌లో రెండు చెంచాల పెట్రోలియం జెల్లీ వేసి రోజూ రుద్దుకున్నా ఫలితం ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement