హెల్దీ ట్రీట్‌

Breakfast with proteins is good for children - Sakshi

►కావలసినవి: 
ఓట్స్‌ – 1 కప్పు; నీరు – 2 కప్పులు; ఆపిల్‌ – 1; 
నిమ్మరసం – 2 టీ స్పూన్లు; కిస్‌మిస్‌ – 1 టేబుల్‌ స్పూన్‌; వేరుశనగపప్పు – 1 టేబుల్‌ స్పూన్‌; పాలు – 1 కప్పు; తేనె – 2 టీ స్పూన్లు 

తయారి: 
రాత్రి ఓట్స్‌ని నీళ్ళలో నానబెట్టాలి.
 
ఉదయాన ఆపిల్‌ పై తొక్క తీసి ముక్కలుగా కట్‌చేసి, ముక్కలకు బాగా అంటేలా నిమ్మరసం వేసి కలపాలి. 

తర్వాత ఇందులో కిస్‌మిస్, వేరుశనగపప్పు, మెత్తగా అయిన ఓట్స్‌ వేసి కలపాలి. 

పాలు పోసిన తర్వాత పైన తేనె వేసి పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవ్వాలి. 

నోట్‌: పిల్లలకు సరైన పోషకాహారం అందించాడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఓట్స్‌లో కొవ్వుపదార్థాలు ఉండవు. కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉన్న ఈ అల్పాహారం పిల్లలకే కాదు, పెద్దలకూ మంచిదే. ఈవెనింగ్‌ స్నాక్‌గాను తీసుకోవచ్చు. ద్రాక్ష, స్ట్రాబెర్రీ, అరటిపండ్లనే కాదు పాలు కూడా ఇష్టప్రకారం వాడుకోవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top