చల్లగాలి కోసం.. బుల్లి యంత్రం! | blo machine for cool air | Sakshi
Sakshi News home page

చల్లగాలి కోసం.. బుల్లి యంత్రం!

Dec 26 2017 11:38 AM | Updated on Apr 3 2019 4:04 PM

blo machine for cool air - Sakshi

ఇప్పుడంటే చలికాలం. ఇంకో నాలుగు నెలలు పోనివ్వండి.. ఫ్యానెక్కడ? ఏసీ పనిచేస్తోందా? కూలర్‌లోకి ఐస్‌ ఎప్పుడేద్దాం? అని నానా హైరానా పడిపోతాం. వేసవి తాపం అలాంటిది మరి. ఇప్పుడు పై ఫొటో చూడండి. ఈ బుల్లి యంత్రం మీ దగ్గరుంటే ఉక్కపోత అస్సలు ఉండదు. పైగా ఎంత వేడి వాతావరణంలో తిరిగినా ఒళ్లు మాత్రం చల్లగానే ఉంటుంది. పేరు ‘బ్లో’. ఏం మాయ చేస్తుంది ఈ యంత్రం అంటున్నారా? చాలా సింపుల్‌. మోటార్‌ కార్లలో సువాసనలు వెదజల్లేందుకు వాడే డిఫ్యూజర్‌లా ఉంటుంది ఇది. మోటార్‌ పనిచేసేందుకు ఓ రీఛార్జబుల్‌ బ్యాటరీ కూడా ఉంటుంది.

కార్లలో మాదిరిగానే డిఫ్యూజర్‌లో పిప్పర్‌మెంట్‌ నూనెను వాడారనుకోండి. సహజంగానే చల్లదనాన్ని ఇచ్చే పిప్పర్‌మెంట్‌ నూనెకు గాలి కలిసి ఒళ్లంత చల్లగా అయిపోతుందన్నమాట. షర్ట్‌ కు తగిలించుకోగలగడం, రీఛార్జిబుల్‌ బ్యాటరీ ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని వాడుకోవచ్చు. బయటి ఉష్ణోగ్రత కంటే కనీసం ఆరు డిగ్రీలు తక్కువ చేస్తుంది ఈ యంత్రం. ముగ్గురు యువకుల ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ బుల్లి ఏసీ యంత్రం ప్రస్తుతానికి మార్కెట్‌లోకి రాలేదు. అయితే వాణిజ్యస్థాయి అభివృద్ధికి 5000 డాలర్లు కావాలని కిక్‌స్టార్టర్‌లో పిలుపునిచ్చారు. ఆ వెంటనే దాదాపు రెండు లక్షల డాలర్లు వచ్చిపడటం, ఈ ఉత్పత్తిపై అందరి ఆసక్తి ఏమిటన్నది స్పష్టమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement